ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల మరణ మృదంగం!

ABN, First Publish Date - 2021-12-31T08:13:26+05:30

గడచిన 3, 4 నెలలుగా రాష్ట్రంలో రైతుల మరణ మృదంగం మోగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గడచిన 3, 4 నెలలుగా రాష్ట్రంలో రైతుల మరణ మృదంగం మోగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారికంగానే నిత్యం 5 నుంచి 10 మంది వరకు రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.  ‘పంట నష్టం జరిగిందనో, అప్పుల భారం మోయలేకనో నిస్సహాయ స్థితిలో బలవన్మరణం పొందుతున్నారు. ఒక వైపు వరి రైతుల పరిస్థితి అగమ్యగోచరం. మరో వైపు మిర్చి రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలకు కారణాలు అన్వేషించి, పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం దున్నపోతుపై వర్షం పడిన చందంగా వ్యవహరిస్తోందని సీఎం కేసీఆర్‌కు గురువారం రాసిన లేఖలో రేవంత్‌ పేర్కొన్నారు. రైతుల ప్రాణాలను గడ్డిపోచ కంటే హీనంగా లెక్కగట్టే పాలనలో తెలంగాణ ఉందని ఆరోపించారు. మిర్చి రైతుల చావు కేకలు మీకు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. సగటున ఒక్కో మిర్చి రైతు నెత్తిన రూ.5-10 లక్షలు అప్పు ఉందన్నారు. పంట నష్టపోయిన మిర్చి రైతులకు తక్షణం పరిహారం ప్రకటించాలని, తిరిగి పంట వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు ఉచితంగా సరఫరా చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని, రూ.లక్ష రుణమాఫీని తక్షణం అమలు చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. కాగా, ఖజానా దివాళా తీసిందా? లేక పన్ను పోటుతో ప్రజలను వేధించడం మీకు పైశాచిక ఆనందమా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. పేద రాష్ట్రమైన ఝార్ఖండ్‌ పెట్రోలు ధరను రూ. 25 తగ్గించిందని,  ధనిక రాష్ట్రమని చెప్పుకొనే కేసీఆర్‌ ప్రభుత్వం మాత్రం పైసా తగ్గించేది లేదంటోందని ట్విటర్‌ వేదికగా విమర్శించారు.


ప్రజల కంటే ఆదాయమే ముఖ్యమా? :షబ్బీర్‌

కొవిడ్‌ నేపథ్యంలో ప్రజల ప్రాణాల కంటే ఆదాయం పెం చుకునేందుకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ విమర్శించారు. 31న అర్ధరాత్రి వరకు మద్యం షాపులకు అనుమతి ఇవ్వడం అమానవీయమని ట్వీట్‌ చేశారు.ఖజానా నింపుకోవడానికే ఈ ఏర్పాట్లని టీపీసీసీ అధికార ప్రతినిధి రవళి ఒక ప్రకటనలో ఆరోపించారు.  ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ యత్నిస్తోందని మాజీ ఎంపీ వీహెచ్‌ ఆరోపించారు. గుంటూరులో జిన్నా టవర్స్‌ పే రు మార్చాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.   

Updated Date - 2021-12-31T08:13:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising