ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీ పునరుద్దరణపై తక్షణం జిల్లా స్థాయి కమిటీ సమావేశాలు

ABN, First Publish Date - 2021-06-27T23:03:33+05:30

అన్నిజిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి సమావేశానికి కొనసాగింపుగా అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అరణ్య భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అన్నిజిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి సమావేశానికి కొనసాగింపుగా అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అరణ్య భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణకు హరితహారం, అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్దిపై సీ.ఎం ఆదేశాలు, సూచనలపై ప్రధానంగా అన్ని జిల్లాల అటవీ అధికారులతో సమావేశంలో చర్చ జరిగింది. ప్రతీ అటవీ ప్రాంతంలో ఆక్రమణలు లేకుండా, ఏమాత్రం స్మగ్లింగ్ జరగకుండా చూడటమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. బ్లాకుల వారీగా అన్ని జిల్లాల్లో అటవీ భూముల సరిహద్దుల గుర్తింపు, స్థీరీకరణ, పునరుద్దరణ తక్షణం చేపట్టాలని తెలిపారు. 


అటవీ ప్రాంతంగా నమోదైన అన్ని బ్లాకుల్లో అటవీ పునరుద్దరణ జరగాలనే ముఖ్యమంత్రి ఆకాంక్షను నెరవేర్చే దిశగా పనులు జరగాలన్నారు. ఇందుకోసం ప్రతీ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ వెంటనే సమావేశమై కార్యాచరణ సిద్దం చేయాలని కోరారు.ఏడవ విడత హరితహారంలో అన్ని రోడ్ల వెంట బహుళ సంఖ్యలో రహదారి వనాలకు (మళ్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్) ప్రాధాన్యతను ఇవ్వాలని, సాధ్యమైనంత పెద్ద మొక్కలు నాటేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలను తెలిపారు. ఇతర శాఖల ఆధ్వర్యంలో జరిగే హరితహారం కోసం అటవీ శాఖ సాంకేతిక సహకారం అందిచాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 109 అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో యాభై శాతం పూర్తి అయ్యాయని, మిగిలిన వాటిల్లో పనులను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని శాంతి కుమారి సూచించారు. జీరో స్మగ్లింగ్ లక్ష్యంగా అటవీ శాఖలో ప్రతీ ఒక్కరూ పనిచేయాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ తెలిపారు. 


ఇప్పటికే ఉన్న చెక్ పోస్టులకు బలోపేతం చేయాలని,ఉన్నతాధికారులు తప్పని సరిగా క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళుతూ, చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించాలని, అలాగే చెక్ పోస్టులు లేని, స్మగ్లింగ్ కు ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆ రూట్లలో నిఘాను పటిష్టం చేయాలన్నారు. చిన్న స్థాయి సిబ్బంది నుంచి పై అధికారుల దాకా విధి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం కనిపించినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. హరితహారంలో చింత చెట్లు పెద్ద  సంఖ్యలో నాటేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు.సమావేశంలో పీసీసీఎఫ్ లు లోకేశ్ జైస్వాల్, ఆర్.ఎం. దోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ ఎం.సీ. పర్గెయిన్, అన్ని అటవీ సర్కిళ్ల చీఫ్ కన్జర్వేటర్లు, కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్లు, అన్నిజిల్లాల అటవీ అధికారులు, యువ ఫారెస్ట్ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-27T23:03:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising