ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీ అధికారులు మోసం చేశారు

ABN, First Publish Date - 2021-02-08T09:38:56+05:30

తమ పోడు భూముల్లో కాలువ పనులు చేపట్టకుండా ఉండేందుకు అటవీ శాఖ అధికారులు తమ వద్ద డబ్బులు వసూలుచేసి చివరికి తమపైనే కేసులు పెట్టి మోసం చేశారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డబ్బు తీసుకుని మాపైనే కేసులు పెట్టారు.. గిరిజన రైతుల ఆరోపణ


ఇల్లెందు రూరల్‌, జనవరి 7: తమ పోడు భూముల్లో కాలువ పనులు చేపట్టకుండా ఉండేందుకు అటవీ శాఖ అధికారులు తమ వద్ద  డబ్బులు వసూలుచేసి చివరికి తమపైనే కేసులు పెట్టి మోసం చేశారని భద్రాచలం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం గిరిజన రైతులు ఆరోపించారు. తమ దగ్గరి నుంచి కొమరారం ప్రాంతానికి చెందిన అటవీ సెక్షన్‌ అధికారి, బీట్‌ అధికారి రూ.3 లక్షలకు పైగా తీసుకున్నారని కొమరారం, కొరంగుంపు, చింతలగుంపునకు చెందిన 33 మంది రైతులు ఆరోపించారు. పైగా తమ భూముల్లో కాలువ పనులు చేపడుతుంటే వారిని ప్రశ్నించినందుకు తమపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నా తమ భూములకు పట్టాలు ఇవ్వకుండా కొన్నేళ్లుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. ఆ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై కొమరారం అటవీ సెక్షన్‌ అధికారి సుక్కిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా తాము ఎవరి దగ్గరి నుంచీ డబ్బు తీసుకోలేదన్నారు. 

Updated Date - 2021-02-08T09:38:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising