ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండ్లు పిరం

ABN, First Publish Date - 2021-07-21T09:17:51+05:30

ఇంట్లో ఎవరికైనా సుస్తీ చేసినప్పుడు ఆపిల్స్‌, ద్రాక్ష తదితర పండ్లు తినిపిస్తాం. ప్రస్తుతం ఒక్క యాపిల్‌ ధర 35 రూపాయలు ఉంది. ద్రాక్షా పళ్లు రూ.130 నుంచి రూ. 140 దాకా ఉన్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సామాన్యులకు అందనంత ఎత్తుల్లో మధుర ఫలాలు
  • హోల్‌సేల్‌లో ఒక ఆపిల్‌ రూ.27.. రిటైల్‌లో రూ.35 దాకా 
  • రిటైల్‌ మార్కెట్‌లో 15 కిలోల ద్రాక్ష బాక్సు రూ.1300-1400 
  • జామ, దానిమ్మ, బత్తాయి, కమలాల ధరలూ పైపైకి

హైదరాబాద్‌ సిటీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో ఎవరికైనా సుస్తీ చేసినప్పుడు ఆపిల్స్‌, ద్రాక్ష తదితర పండ్లు తినిపిస్తాం. ప్రస్తుతం ఒక్క యాపిల్‌ ధర 35 రూపాయలు ఉంది. ద్రాక్షా పళ్లు రూ.130 నుంచి రూ. 140 దాకా ఉన్నాయి! ఈ ధరలు చూస్తేనే జ్వరమొచ్చే పరిస్థితులొచ్చాయి! ఇవే కాదు.. జామ, కమలా, బత్తా యి, నారింజ తదితర అన్ని పండల్ల ధరలూ కొండెక్కా యి. నాలుగు నెలల క్రితం దాకా ఒక కమలా పండు రూ.10కి దొరికేది. ఇప్పుడు కొన్నిచోట్ల రూ.150 పెట్టినా అరడజను కూడా రావడం లేదు. దానిమ్మ ఒకటి రూ.20కి దొరికేది. ఇప్పుడు రూ.50 పెట్టినా దొరకడం లే దు. పేదింటి ఆపిల్‌ అయిన జామ కిలో రూ.70 నుంచి రూ.100 దాకా పలుకుతోంది. బత్తాయి పండ్లు కిలో రూ. 150-200 రేటు ఉంది. కొత్తపేట, గడ్డి అన్నారం, మోజంజాహీ సహా అన్ని మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి. 


ఇంతలా ఎందుకు పెరిగినట్లు? 

కరోనా కారణంగా జనాల్లో ఆరోగ్యం పట్ల స్పృహ బాగా పెరిగింది.  రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు పోషక విలువలతో కూడిన ఆహా రం తీసుకునేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దా చిన్నా అంతా పండ్లు తీసుకుంటున్నారు! శరీర ధారుఢ్యంపైనా స్పృహ పెరగడంతో జిమ్‌లలో కసరత్తులు చేసే యువత కూడా సత్వర శక్తి కోసం తక్కువ కేలరీలున్న పండ్లనే బాగా తింటున్నారు. ఇలా కొన్ని నెలలుగా పండ్ల కొనుగోలు బాగా పెరిగిపోయింది. అదే సమయంలో పండ్ల దిగుమతి  బాగా తగ్గిపోయింది. గతంలో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌కు విరివిగా వచ్చే కశ్మీర్‌, సిమ్లా ఆపిల్‌, పండ్లు ప్రస్తుతం రావడం లేదు. పండ్ల ధరల పెరుగుదలకు ఇంధన ధరల పెరుగుదల కూడా ప్రధాన కారణం. 


విదేశీ పండ్లకు భలే గిరాకీ 

రాష్ట్రంలో దానిమ్మ, కమలాల సాగు తక్కువగా ఉండటంతో మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి నగరానికి దిగుమతి అవుతున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పండ్లు.. ముంబై చెన్నై టోకు కంపెనీల నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్‌కు చేరుతున్నాయి. ఆపి ల్‌, కివీ, ఆరెంజ్‌ పండ్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లోని రిటైలర్లు పోటీ పడి తీసుకుంటున్నారు. న్యూజిలాండ్‌, థాయిలాండ్‌ నుంచి ఆపిల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. కివీ పండ్లను న్యూజిలాం డ్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, ఇరాన్‌ నుంచి.. ఆరెంజ్‌ను అమెరికా, ఈజిప్టు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రే లియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. చిలీ తదితర దేశాల నుంచి దిగుమ తి అవుతున్న రాయల్‌ గాలా, చిలీ గాలా...  వాషింగ్టన్‌, టర్కీ ప్రాంతాల నుంచి వస్తున్న రెడ్‌ డెలీషియస్‌, న్యూ జిలాండ్‌ గాలా, బ్రెజిల్‌ గాలా ఆపిల్‌ రకాలకు డిమాండ్‌ ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.  



నవనవలాడుతూ కనువిందు చేస్తున్న పండ్లు నోరూరిస్తున్నాయి. ఓ నాలుగైదు పండ్లను చేతుల్లోకి తీసుకొమ్మని మనసు తెగ లాగుతున్నా, వామ్మో అంత ధరే.. అంటూ గుండె హైరానా పడుతోంది. అంతే, అక్కడి నుంచి అడుగులు భారంగా కదులుతాయి. పండు ముక్క కొరికే భాగ్యమెప్పుడో? అని జిహ్వ చాపల్యంతో మనసు మాత్రం మధనపడుతూనే ఉంటది! పండ్ల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలకు పండ్లను చూసే అదృష్టమే తప్ప కొనుక్కొని తినే భాగ్యం లేకుండాపోయింది. 





Updated Date - 2021-07-21T09:17:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising