ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలులో 65 కిలోల గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2021-12-30T05:36:11+05:30

రైలులో 65 కిలోల గంజాయి పట్టివేత

నిందితుల వివరాలు తెలుపుతున్న జీఆర్‌పీ సీఐ నరేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిర్మాజిపేట, డిసెంబరు 29 : ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌ నుంచి ముంబాయి వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో 65కిలోల ఎండు గంజాయిని బుధవారం వరంగల్‌ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు వివ రాలను జీఆర్‌పీ స్టేషన్‌లో  బుధవా రం విలేకరుల సమావేశంలో సీఐ జి.నరేష్‌ వెల్లడించారు. బుధవారం వరంగల్‌ జీఆర్పీ ఎస్సై పరశురాం ఆధ్వర్యంలో హెడ్‌ కానిస్టేబుల్‌ కె.సురేష్‌, కానిస్టేబుళ్లు జె.అనిల్‌, కె.భాస్కర్‌, బి.రమేష్‌, ఎస్‌.అనిల్‌తో కూడిన బృందం వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టింది. రెండో ప్లాట్‌ఫాంపై తనిఖీచేస్తున్న సమయంలో భువనేశ్వర్‌- ముంబాయి కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు అదే ప్లాట్‌ఫాంపైకి వచ్చిం ది. జీఆర్పీ సిబ్బంది రైలులోని ఏసీ బోగీలను తనిఖీ చేస్తుండగా ట్రాలీ సూట్‌కేసులు, షోల్డర్‌ బ్యాగులతో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని వరంగల్‌ జీఆర్‌పీకి తరలించి విచారించి ట్రాలీ సూట్‌కేసులు, బ్యాగులను చూడగా 65కిలోల ఎండు గంజాయి లభ్య మైంది. గంజాయిని తరలిస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన సలీం(25), ఒడిశాకు చెందిన పూర్ణఖోస్ల (22)లను అరెస్టు చేశారు. పట్టుబడిన గంజాయితో పాటు సలీం, పూర్ణఖోస్లలను కాజిపేట రైల్వేకోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నరేష్‌ తెలిపారు. ఈ గంజాయి విలువ రూ.6.50 లక్షలు ఉంటుందని తెలిపారు. పూర్ణఖోస్ల, సలీంలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయనగరం, విశాఖపట్టణంలో గంజాయిని కొనుగోలు చేసి కోణార్స్‌ ఎక్స్‌ప్రెస్‌లో ముంబాయికి తరలిస్తున్నారని సీఐ తెలిపారు. సమావేశంలో జీఆర్పీ కాజిపేట సీఐ రామ్మూర్తి, వరంగల్‌ ఎస్సై పరశురాం పాల్గొన్నారు.


Updated Date - 2021-12-30T05:36:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising