మూడు ప్రైవేట్ ఆస్పత్రుల లైసెన్సులు పునరుద్ధరించిన వైద్యారోగ్య శాఖ
ABN, First Publish Date - 2021-06-09T16:50:54+05:30
మూడు ప్రైవేట్ ఆస్పత్రుల కరోనా చికిత్సల లైసెన్సులను వైద్యారోగ్య శాఖ పునరుద్ధరించింది.
హైదరాబాద్: మూడు ప్రైవేట్ ఆస్పత్రుల కరోనా చికిత్సల లైసెన్సులను వైద్యారోగ్య శాఖ పునరుద్ధరించింది. సికింద్రాబాద్ కిమ్స్, గచ్చిబౌలి సన్ షైన్, లక్డీకాపూల్ లోటస్ ఆస్పత్రిపై చర్యలు నిలిపివేసింది. కరోనా చికిత్సల అనుమతులు పునరుద్దరిస్తూ బుధవారం డీహెచ్ శ్రీనివాస రావు ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు సూచనల మేరకు కరోనా చికిత్సలకు ఆటంకం కలగవద్దనే చర్యలు నిలిపివేసినట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు.
అధికంగా వసూలు చేసిన సొమ్మును రెండు వారాల్లో తిరిగి బాధితులకు చెల్లించాలని డీహెచ్ ఆదేశించారు. మరోసారి అధిక చార్జీలు వసూలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని, ఆస్పత్రి లైసెన్సు రద్దు చేసి యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామని శ్రీనివాస రావు హెచ్చరించారు.
Updated Date - 2021-06-09T16:50:54+05:30 IST