ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఏడాది ఖైరతాబాద్‌లో మట్టి గణపతే.. 70 అడుగుల విగ్రహం.. అక్కడే నిమజ్జనం..!

ABN, First Publish Date - 2021-09-15T13:41:25+05:30

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్(పీఓపీ) విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మేయర్‌ విజ్ఞప్తికి స్పందించిన నిర్వాహకులు


హైదరాబాద్ సిటీ/ఖైరతాబాద్‌ : ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్(పీఓపీ) విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్‌ ప్రథమ పౌరురాలు గద్వాల్‌ విజయలక్ష్మి విజ్ఞప్తి మేరకు వచ్చే యేడాది మట్టి గణపతిని ప్రతిష్టించేందుకు నిర్వాహకులు అంగీకరించారని మేయర్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారం ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకున్న విజయలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మట్టి గణపతి ఏర్పాటుపై ఉత్సవ కమిటీ ప్రతినిధులతో చర్చించారు. పర్యావరణం, నిమజ్జనంలో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఏకో ఫ్రెండ్లీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్వాహకులను కోరారు. ఆమె విజ్ఞప్తిపై వారు సానుకూలంగా స్పందించినట్టు మేయర్‌ కార్యాలయం తెలిపింది. వచ్చే యేడాది ఖైరతాబాద్‌లో 70 అడుగుల మట్టి గణపతి ప్రతిష్టించి అక్కడే నిమజ్జనం చేయాలనే ఆలోచన ఉందని చైర్మన్‌ సింగారి సుదర్శన్‌, కన్వీనర్‌ సందీ్‌పరాజ్‌ తెలిపారు.



Updated Date - 2021-09-15T13:41:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising