ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్: వరి పంట ఉరి ఎవరికి పడనుంది?..

ABN, First Publish Date - 2021-12-27T17:46:04+05:30

వరి పంట ఉరి ఎవరికి పడనుంది. రాజకీయాలు గమనిస్తున్న రైతులు వచ్చె ఎన్నికల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వరి పంట ఉరి ఎవరికి పడనుంది. రాజకీయాలు గమనిస్తున్న రైతులు వచ్చె ఎన్నికల్లో అసలు నిజం ఏంటనేది తమ ఓటు తీర్పు ద్వారా తెలియపర్చనున్నారా? వడ్లు కొనడంలేదని కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ధ్వజమెత్తుతోంది. అసలు కోటా ప్రకారం ఇవ్వాల్సిన బియ్యం రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వలేదని కేంద్రమంటోంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం డ్రామాలాడుతూ రైతులను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది. తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు తప్పవని నమ్ముతున్న పార్టీలు తమ అసలు, సిసలు, ఎజెండాను ప్రజలముందు ఉంచుతున్నారు. మరోవైపు సంప్రదాయ పంటలు తప్ప మరో దారిలేని రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.


ఒకప్పుడు బీడ్లుగా నోళ్లు తెరుచుకున్న భూములు ఇప్పుడు నీళ్లతో జాలువారేలా పరిస్థితి తయారైంది. వరి తప్ప మరో పంట పండే ప్రత్యామ్నాయం లేకపోవడంతో అన్నదాతలు వరి మాత్రమే పండిస్తున్నారు. ఇక్కడే రాజకీయం మొదలైంది. వ్యయసాయ ఆధారిత రాష్ట్రమైన తెలంగాణలో సన్న చిన్నకారు రైతులు తమపై జరుగుతున్న రాజకీయ క్రీడను చూస్తూ దిగాలుపడుతున్నారు. పొలాల్లో పంట సంగతి ఏమో కానీ అన్నదాత రూపంలో ఓట్ల పంట పండించుకునేందుకు రాజకీయ పార్టీలు ఆరాటపడుతున్నాయనే విషయం మాత్రం సామాన్యులకు సయితం అర్థమైపోయింది.

Updated Date - 2021-12-27T17:46:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising