ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ

ABN, First Publish Date - 2021-02-27T15:30:54+05:30

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలను కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి.. సాగర్ ఉప ఎన్నికపై గురి పెట్టాలని బీజేపీ భావిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలను కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి.. సాగర్ ఉప ఎన్నికపై గురి పెట్టాలని  బీజేపీ భావిస్తోంది. పట్టభద్రులే లక్ష్యంగా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారాన్ని హోరెత్తించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులను బరిలోకి దింపనుంది. గ్రాడ్యుయేట్లతో బీజేపీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో పట్టభద్రులకు కేంద్రమంత్రులు వివరించనున్నారు. పట్టభద్రులు, నిరుద్యోగుల్లో  టీఆర్ఎస్‌పై వ్యతిరేకత కలసి వస్తోందని  బీజేపీ నమ్ముతోంది. నేడు హైదరాబాద్‌కు రానున్న కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్... ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హోటల్ మారియట్‌లో గ్రాడ్యుయేట్స్‌తో ప్రకాష్ జవడేకర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్  సమావేశంకానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఐవైఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొననున్నారు. 

Updated Date - 2021-02-27T15:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising