బండి సంజయ్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సవాల్
ABN, First Publish Date - 2021-05-02T17:52:07+05:30
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ తీరు సమాజం సిగ్గుపడేలా ఉందని వ్యాఖ్యానించారు. లుచ్చగాళ్ళు ఎవరు ఏ కాగితం ఇస్తే అది చదువుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర కలిగిన నేతల మీద నిందారోపణలు చేయడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎక్కడ ఉన్నారో తాము ఎక్కడ ఉన్నామో తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. ‘‘జైలుకు వెళ్లిన మా పైనా మీరా మీట్లాడేది..ఉద్యమంలో మీ స్థానం ఎక్కడ’’ అని ప్రశ్నించారు. అద్వానీ రథయాత్రకు, గడగారి నిజామాబాద్ సభకు తాము సహకరించామరి చెప్పుకొచ్చారు. తమ నేతలు పెద్ద పెద్ద గెస్ట్ హౌజ్‌లు కట్టుకుని విలసాలు చేస్తే తప్పు లేద కానీ...తాము మంచిగా బతుకొద్దా అని నిలదీశారు. తాము తమ చమట రక్తంతో 5 ఎకరాల 34గుంటల భూమి కొనుక్కున్నామని స్పష్టం చేశారు. తమకుఅమ్మినవారు కూడా బతికే ఉన్నారని తెలిపారు. పది ఏళ్ల తర్వాత ఎక్స్ సర్వీస్‌మెన్ తన భూమిని అమ్ముకునే అధికారం ఉందని...అది తాను కొనుక్కుని ఇల్లు కట్టుకుంటే కూడా కళ్ళ మంట ఎందుకు అని మండిపడ్డారు. తాము మంచి ఇల్లు కూడా కట్టుకోవద్దా? గుడిసె వేసుకుని బతకాలా? ప్రశ్నించారు. డీటీసీపీ పర్మిషన్ ఉందని..తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. సర్వే నంబర్ 258, 59 61లో 5ఎకరాల,34 గుంటల భూమి పట్టా భూమి అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బండిసంజయ్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. ‘‘ప్రభుత్వ భూమి అని నిరూపిస్తే తక్షణమే అన్ని పదవులకు రాజీనామా చేస్తా...నిరూపించకపోతే నీ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమా? అందరి చరిత్ర మా దగ్గర కూడా ఉంది’’ అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
Updated Date - 2021-05-02T17:52:07+05:30 IST