ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్‌లో ఉండి వ్యాసాలు రాసేవాడ్ని

ABN, First Publish Date - 2021-06-09T16:43:09+05:30

‘‘ప్రజాజీవితంలో బిజీగా ఉండే నాకు మే 12న జ్వరం వచ్చింది. మూడు రోజులైనా తగ్గలేదు. మే 15న కరోనా టెస్టు చేయించుకున్నాను. పాజిటివ్‌ వచ్చింది. వెంటనే మా ఆవిడ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు డోస్‌లూ తీసుకున్నా కరోనా బారిన పడ్డా

నాతో పాటు భార్య, కొడుకు కూడా..

వివేకానందుడి సూక్తులే ధైర్యం పెంచాయి

యోగాసనాలు, వైద్యుల సూచనలతో కరోనాను జయించా

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె లక్ష్మణ్‌ 


‘‘ప్రజాజీవితంలో బిజీగా ఉండే నాకు మే 12న జ్వరం వచ్చింది. మూడు రోజులైనా తగ్గలేదు. మే 15న కరోనా టెస్టు చేయించుకున్నాను. పాజిటివ్‌ వచ్చింది. వెంటనే మా ఆవిడ ఉమ, కుమారుడు రాహుల్‌కు కూడా టెస్టు చేయించాను వారికి కూడా పాజిటివ్‌ వచ్చింది. రెండో డోసు టీకా తీసుకున్న 25 రోజులకు పాజిటివ్‌ రావడంతో తొలుత ఆందోళనకు గురయ్యాను. కరోనా నుంచి నాతో పాటు కుటుంబాన్ని రక్షించుకోవాలని ధైర్యం కూడగట్టుకున్నాను. స్వామి వివేకానంద చెప్పిన ‘ధైర్యమే ప్రాణం, బలహీనతే మరణం’ అనే సూక్తిని గుర్తు చేసుకున్నాను. కరోనా నుంచి బయటపడే మార్గాలు అన్వేషించాను.’’ అని పేర్కొన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె లక్ష్మణ్‌. అందుకు తీసుకున్న జాగ్రత్తలు, పాటించిన నియమాలు ఆయన మాటల్లోనే.. 


 నా వయస్సు 63. మా ఆవిడ ఉమ (55) గృహిణి. అబ్బాయి రాహుల్‌ (32). అశోక్‌నగర్‌లో ఉంటున్నాం. మే 15న మాకు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఫ్యామిలీ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ను సంప్రదించాను. తొలుత ఐదు రోజులకు మందులు ఇచ్చారు. తర్వాత నాకు కొంత బ్రీతింగ్‌ సమస్య ఏర్పడింది. డాక్టర్‌ సూచన మేరకు సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరాను. అక్కడ డాక్టర్‌ ఎడ్లపాటి గోపీచంద్‌ పర్యవేక్షణలో అయిదు రోజులు ఉన్నాను. ఎలాంటి సమస్యా లేకపోవడంతో డిశ్చార్జి చేశారు. ఇంటికి వచ్చాక గోపీచంద్‌ సూచన ప్రకారం మందులను వాడడంతో పాటు రోజూ ఉదయం యోగా, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేసేవాళ్లం. రోజుకు రెండుసార్లు ఆవిరి పట్టేవాళ్లం. నాకు బ్రీతింగ్‌ సమస్య పూర్తిగా తగ్గింది. సాధారణ లక్షణాలున్న మా ఆవిడ, కొడుకుతో పాటు నేను కూడా 15 రోజుల్లో కోలుకున్నాం. 18 రోజులకు పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. మా ఆవిడ, కొడుకు హోం ఐసొలేషన్‌లోనే ఉండి వైద్యుల సలహాలతో కరోనాను జయించారు. ఆస్పత్రిలో చేరిన నేను మనోధైర్యంతో కొద్ది రోజుల్లోనే ఇంటికి చేరాను.


శాకాహారం, డ్రై ఫ్రూట్స్‌ 

కరోనా అని తెలియగానే ఇమ్యూనిటీ పెంచుకోవడంపై దృష్టి సారించాం. రోజూ వ్యాయామాలతో పాటు ఉదయాన్నే పాలు, మొలకెత్తిన విత్తనాలు, డ్రై ఫ్రూట్స్‌, ఉడకబెట్టిన కూరగాయలు, బెల్లం, అల్లంతో చేసిన నువ్వుల లడ్డూలు, మెంతులు, పండ్లు ఆహారంగా తీసుకునేవాళ్లం. 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నప్పటికీ కాలక్షేపం కోసం ఇష్టమైన పుస్తకాలను చదివాను. పలు పత్రికలకు వ్యాసాలు రాశాను. దేశంలోని 24 రాష్ర్టాల ఓబీసీ మోర్చా అధ్యక్షులతో వర్చువల్‌ సమావేశాలు నిర్వహించాను. మిగతా సమయాల్లో టీవీల్లో వచ్చే వార్తలు చూడటం, పత్రికలు చదువుతూ కరోనా మహమ్మారిని మరచిపోయి సాధారణ జీవితం గడిపాను. 


కరోనాకు అదే మందు

మహమ్మారిని జయించాలంటే ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకుగాను పౌష్టికాహారం తీసుకోవాలి. రోజూ ఉదయం వాకింగ్‌, యోగా, వ్యాయామం అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాల గైడ్‌లైన్స్‌ను పాటించాలి. కళ్లకు అద్దాలు లేదా ఫేస్‌షీల్డ్‌ వాడితే మరీ మంచిది. పిల్లలు, వృద్ధులు ఉన్న ఇంట్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. 

- రాంనగర్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి)

Updated Date - 2021-06-09T16:43:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising