మద్యం మత్తులో మహిళల ఇంటికెళ్లి సీరియల్ నటుడు వీరంగం
ABN, First Publish Date - 2021-01-28T17:00:29+05:30
మద్యం మత్తులో బుల్లితెర నటుడునటుడు సమీర్ అలియాస్ అమర్ వీరంగం సృష్టించాడు.
హైదరాబాద్ : మద్యం మత్తులో బుల్లితెర నటుడు సమీర్ అలియాస్ అమర్ వీరంగం సృష్టించాడు. తాగిన మైకంలో ఇద్దరు మహిళలపై దౌర్జన్యానికి దిగాడు. రాత్రి 9 గంటలకు మహిళల ఇంటికెళ్లి మరీ వేధించాడు. అసభ్య పదజాలంతో మహిళలను సమీర్ దూషించాడు. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలన్నందుకు ఇలా రెచ్చిపోయాడని బాధితులు చెబుతున్నారు. సమీర్తో పాటు మరో నలుగురు దాడికి పాల్పడ్డారు. మణికొండలో జరిగిన ఈ ఘటనపై ఆ మహిళలిద్దరూ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఐదు లక్షల రూపాయిలు నగదు అప్పుగా తీసుకుని.. డబ్బులివ్వమని అడిగితే రౌడీయిజం చేస్తున్నాడంటూ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. సమీర్ నుంచి తమకు ప్రాణహానీ ఉందని మహిళలు పోలీసులకు చెప్పడంతో కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళలిద్దరూ తమ దగ్గర సమీర్ డబ్బులు తీసుకున్నాడని చెబుతుండగా ఆయన మాత్రం మరోలా చెబుతున్నాడు.
అసలేం జరిగిందంటే..
శ్రీవిద్య, స్వాతి, లక్ష్మీ కలిసి మణికొండలో బోటిక్ వ్యాపారం నిర్వహించేవారు. కొన్ని కారణాలవల్ల స్వాతి ఆ వ్యాపారం నుంచి తప్పుకుంది. స్వాతికి రావాల్సిన కొన్ని వస్తువులు తిరిగి ఇవ్వకపోవడంతో నిన్న రాత్రి సమీర్తో కలిసి స్వాతి.. శ్రీవిద్య ఇంటికి వెళ్లింది. శ్రీవిద్య ఇంట్లో మాటా మాట పెరిగి అది కాస్త గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో శ్రీవిద్య, లక్ష్మీపై దౌర్జన్యానికి దిగాడు. అంతేకాదు ఆయనతో పాటు ఉన్న మిత్రులు కూడా ఆ మహిళలపై దాడికి తెగబడేంత పనిచేశారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఇరువురి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. సమీర్ సీరియల్ నటుడు. కోయిలమ్మ సీరియల్లో హీరోగా నటించాడు.
Updated Date - 2021-01-28T17:00:29+05:30 IST