రేవంత్‌తో ఎమ్మార్పీఎస్ ప్రతినిధుల భేటీ
ABN, First Publish Date - 2021-12-19T19:04:37+05:30
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు ఆదివారం భేటీ అయ్యారు.
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు ఆదివారం భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని రేవంత్‌ను ప్రతినిధులు కోరారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎమ్మార్పీఎస్ విద్యార్థి సదస్సులో పాల్గొని, మద్దతిచ్చిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ పదే పదే వాయిదా పడుతున్న నేపథ్యంలో వీలు చూసుకుని కాంగ్రెస్ పక్షాన వర్గీకరణ అంశాన్ని లేవనెత్తుతామని ఎమ్మార్పీఎస్ ప్రతినిదులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Updated Date - 2021-12-19T19:04:37+05:30 IST