ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ లక్కీ నంబర్.. ఈటలకు ఇలా కలిసొస్తుందని అనుకోలేదు..!

ABN, First Publish Date - 2021-11-03T01:01:05+05:30

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23,865 ఓట్ల మెజారిటీతో గెలవడం టీఆర్ఎస్‌కు మింగుడుపడడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23,865 ఓట్ల మెజారిటీతో గెలవడం టీఆర్ఎస్‌కు మింగుడుపడడం లేదు. తమ పార్టీకి ఎదురుండదు అనుకుంటున్న తరుణంలో ఇటీవల వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ అంతర్మథనంలో పడింది. ఈ క్రమంలో ఈటల మెజారిటీ, సీఎం కేసీఆర్ లక్కీనంబర్‌కు లింకు పెడుతూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్ లక్కీ నంబర్ ఈటలకు ఈ విధంగా కలిసొస్తుందని అనుకోలందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.


సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్లు చాలా ఎక్కువని తెలిసిందే. జాతకాలు, పూజలను ఆయన బాగా నమ్ముతారు. అలాగే లక్కీ నంబర్ విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ కార్యక్రమం తలపెట్టినా అందులో లక్కీ నంబర్ 6 వచ్చేలా చూసుకుంటుంటారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్, ముందస్తు ఎన్నికల ముహూర్తం ఖరారు చేయడం.. ఇలా పలు సందర్భాల్లో ఆయన లక్కీ నంబర్ ప్రకారమే ముందుకెళ్లారు.


తాజాగా కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలోనూ కేసీఆర్ లక్కీ నంబర్ అయిన ఆరుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆరు పార్కులు, ఆరు కాన్ఫరెన్స్ హాళ్లు.. ఇలా ఆరుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదిలావుండగా ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు వచ్చిన మెజారిటీని క్యాలిక్యులేట్ చేస్తే .. కేసీఆర్ లక్కీ నంబర్ తేలుతోంది. 2+3+8+6+5=24 అవగా.. 2+4=6 వస్తోంది. ఫైనల్‌గా కేసీఆర్ లక్కీ నంబర్ ఈటలకు కలిసొచ్చిందని చర్చించుకుంటున్నారు. 

Updated Date - 2021-11-03T01:01:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising