ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రానికి రెమ్‌డెసివిర్‌ కోటా పెంపు

ABN, First Publish Date - 2021-05-16T08:36:25+05:30

కోవిడ్‌పై జరుగుతున్న యుద్థంలో శనివారం రాష్ర్టానికి కాస్త ఊరట లభించింది. రెమిడెసివర్‌ ఇంజక్షన్‌తోపాటు రాష్ర్టానికి ఆక్సిజన్‌ సరఫరాను పెంచాలని కేంద్రం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రోజుకు 10,500 వయల్స్‌ సరఫరా
  • 200 టన్నుల ఆక్సిజన్‌ అదనం
  • కేసీఆర్‌కు కేంద్రమంత్రి పీయూష్‌ ఫోన్‌
  • కొత్త కోటా రేపటి నుంచే అమల్లోకి

హైదరాబాద్‌, మే 15(ఆంధ్రజ్యోతి): కోవిడ్‌పై జరుగుతున్న యుద్థంలో శనివారం రాష్ర్టానికి కాస్త ఊరట లభించింది. రెమిడెసివర్‌ ఇంజక్షన్‌తోపాటు రాష్ర్టానికి ఆక్సిజన్‌ సరఫరాను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. పక్క రాష్ర్టాల వారు సైతం కోవిడ్‌ చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తుండటంతో కేంద్రం అందిస్తున్న కోటా పెంచాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో.. కేంద్రం స్పందించింది. ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ శనివారం సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి తెలిపారు. కరోనా నియంత్రణకోసం ఆక్సిజన్‌, రెమిడెసివిర్‌, వ్యాక్సిన్లను తెలంగాణకు తక్షణమే సరఫరా చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినట్టు గోయల్‌ చెప్పారు. సోమవారం నుంచి 10,500 రెమిడెసివిర్‌లు అందించనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అదనంగా 200 టన్నుల ఆక్సిజన్‌ను అందించనున్నట్టు తెలిపారు.  చత్తీస్గఢ్‌ రాష్ట్రంలోని భిలాయ్‌ నుంచి, ఒడిశాలోని అంగుల్‌ నుంచి, పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌ నుంచి తెలంగాణకు ఆక్సిజన్‌ సరఫరా చేయనున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌కు ప్రాధాన్యతనివ్వాల్సిందిగా కేంద్రమంత్రి సీఎం కేసిఆర్‌ను కోరారు.

Updated Date - 2021-05-16T08:36:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising