ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’తో క్లీన్‌సిటీస్‌ ఆవిష్కరణ

ABN, First Publish Date - 2021-12-31T19:39:09+05:30

నగరాలు క్లీన్‌సిటీస్‌గా ఆవిష్కృతం అయ్యేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలు దోహదమవుతున్నాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ ఆర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌

జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), డిసెంబరు 30: నగరాలు క్లీన్‌సిటీస్‌గా ఆవిష్కృతం అయ్యేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలు దోహదమవుతున్నాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ ఆర్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులతో మాట్లాడారు. మంత్రితోపాటు మేయర్‌ గుండు సుధారాణి, పురపాలకశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, సీడీఎంఏ సత్యనారా యణ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌-20 21 పోటీల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు.


ఇదే స్ఫూర్తితో 2022 పోటీల్లో మరింత మెరుగైన ఫలితా లను సాధించాల్సిన బాధ్యతను రాష్ట్రంలోని మునిసి పాలిటీలు, కార్పొరేషన్లు గుర్తించాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ దార్శనికతతో పురపాలక సంఘాలకు, పట్టణాలు అభివృద్ధి చెందుటకు పట్టణ ప్రగతి కింద నిధులు విడుదల చేయడం దేశంలోనే ప్రప్రథమని పేర్కొన్నారు. ప్రతి మునిసిపల్‌ కార్యాలయంలో సిటి జెన్‌ సర్వీస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని అధికా రులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. పట్టణాలు, పల్లెలు నిత్యం అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థలకు అదనపు కలెక్టర్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించడం గొప్ప విషయమన్నారు. 

Updated Date - 2021-12-31T19:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising