ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోనమెత్తినం తల్లో!

ABN, First Publish Date - 2021-07-12T08:55:40+05:30

ఆషాఢ మేఘం మెరిసింది.. జల్లు కురిసింది. ఆధ్యాత్మిక సందడి వెల్లివిరిసి భక్త జనం బోనమెత్తింది. అమ్మవారికి నైవేద్యం పెట్టేందుకు గుంపులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన వేడుకలు 

గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొట్టెల ఊరేగింపు

భక్తులతో కోట పరిసరాలు కిటకిట.. ఒక్కరోజే లక్ష మంది దర్శనం! 

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్‌, తలసాని 

ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌


హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఆషాఢ మేఘం మెరిసింది.. జల్లు కురిసింది. ఆధ్యాత్మిక సందడి వెల్లివిరిసి భక్త జనం బోనమెత్తింది. అమ్మవారికి నైవేద్యం పెట్టేందుకు గుంపులు గుంపులుగా కదిలింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగ సందడికి ఆదివారం తెరలేచింది. ఆషాఢం ముగిసేదాకా ఎక్కడ చూసినా ఈ ఆఽధ్యాత్మిక సందడే! హైదరాబాద్‌లోని అమ్మవార్ల ఆలయాల్లోనైతే ఆ సంబురం మరింత. గోల్కొండపై కొలువైన జగదాంబికా అమ్మవారి బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. లంగర్‌హౌజ్‌ నుంచి గోల్కొండ కోట జగదాంబికా ఆలయం దాకా పోతరాజుల నృత్య విన్యాసాలు, తీన్మార్‌ డప్పు చప్పుళ్లు, మంగళవాయిద్యాల మధ్య కన్నుల పండుగగా తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి భక్తజనం పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.


భక్తజనంతో గోల్కొండ కోట పరిసరాలు కిక్కిరిపోయాయి. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ఉదయం నుంచే క్యూలైన్లు కనిపించాయి. ఆదివారం లక్ష మంది దాకా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అంచనా. కోట పరిసరాలను విద్యుద్దీపాలతో అలకరించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఏటా ఆషాడమాసంలోని ఆదివారాలు, గురువారాల్లో జగదాంబ ఆలయంలోని అమ్మవారికి బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. జూలై 25న సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, ఆగస్టు 1న లాల్‌దర్వాజా, అక్కన్న మాదన్న ఆలయాల్లో బోనాల వేడుకలు జరుగుతాయి. కాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు కలగాలని, వారంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-12T08:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising