ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానం

ABN, First Publish Date - 2021-10-19T05:35:33+05:30

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2021 కు ఎంపికైన జిల్లా గుణాత్మక విద్య సమన్వయకర్త గడ్డం జగదీశ్వర్‌ సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సన్మానించారు.

జగదీశ్వర్‌కు అవార్డు ప్రదానం చేస్తున్న దత్తాత్రేయ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 18 : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2021 కు ఎంపికైన జిల్లా గుణాత్మక విద్య సమన్వయకర్త గడ్డం జగదీశ్వర్‌ సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సన్మానించారు. భారత రత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ అబ్దుల్‌ కలాం 90వ జయంతిని పురస్కరించుకొని లీడ్‌ ఇండియా ఫౌండే షన్‌ ఆధ్వర్యంలో కలాం మిషన్‌లో భాగంగా ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హర్యానా రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తా త్రేయ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా జగదీశ్వర్‌ సేవలను, కృషిని దత్తాత్రేయ కొనియాడారు. ఈ అవార్డుల కార్యక్రమంలో లీడ్‌ ఇండియా ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షుడు ఎంబీ సుదర్శనచార్య జగదీశ్వర్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో లీడ్‌ ఇండియా ప్రముఖులు పుల్లె ల గోపిచంద్‌, కందాల పాపిరెడ్డి, అరుకాల రామచంద్రారెడ్డి, పెద్దపల్లి జిల్లా ప్రతి నిధి బందారపు యాదగిరిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లా విద్యాశాఖాధికారి డి.మాధవి, జిల్లా కోఆర్డినేటర్‌ విజయ్‌కుమార్‌, జిల్లా సైన్స్‌ అధికారి రవినందన్‌రావు, ప్రవీన్‌కుమార్‌, జిల్లా విద్యాశాఖ సిబ్బంది జగదీశ్వర్‌కు అభినందనలు తెలిపారు. 

Updated Date - 2021-10-19T05:35:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising