ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గోనె’ దిష్టిబొమ్మ దహనం

ABN, First Publish Date - 2021-12-19T05:56:57+05:30

గోదావరిఖని చౌరస్తాలో 28వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఇంజపురి పులేందర్‌ ఆధ్వర్యంలో శనివారం గోనె ప్రకాష్‌రావు దిష్టిబొమ్మ దహనం చేశారు.

దిష్టిబొమ్మ దహనం చేస్తున్న కార్పొరేటర్‌, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్యాణ్‌నగర్‌, డిసెంబరు 18: గోదావరిఖని చౌరస్తాలో 28వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఇంజపురి పులేందర్‌ ఆధ్వర్యంలో శనివారం గోనె ప్రకాష్‌రావు దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌పై ఆర్‌టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాష్‌రావు చేసిన ఆరోపణలను ఖండిం చారు. ఈ సందర్భంగా పులేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే చందర్‌పై గోనె వ్యాఖ్యలు సబబు కాదని, ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేస్తే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ఏ పనులు కూడా జరుగలేదని, రామగుండానికి మెడికల్‌ కళాశాల తీసుకువచ్చిన ఘనత చందర్‌కే దక్కుతుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం పని చేసే మంత్రి, ఎమ్మెల్యేపై అవాకులుచెవాకులు పేలితే ఊరుకోమని, గోనె ప్రకాష్‌రావు వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు కొండ సురేష్‌, జక్కుల ప్రేమ్‌కుమార్‌, మేకల శ్రీనివాస్‌, ఏసయ్య, రమేష్‌, ప్రణిత్‌, రాకేష్‌, లవణ్‌కుమార్‌, శ్రావణ్‌కుమార్‌, ప్రసాద్‌, శంకర్‌, అంజయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-12-19T05:56:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising