ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం తగదు

ABN, First Publish Date - 2021-08-20T06:07:08+05:30

పారిశుధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ జి.రవి పేర్కొన్నారు.

పారిశుధ్య పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫజిల్లా కలెక్టర్‌ జి.రవి

మల్యాల, ఆగస్టు 19: పారిశుధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ జి.రవి పేర్కొన్నారు. మండలం లోని రామన్నపేటలో నెల రోజులుగా జ్వరాలు విజృంభించడం, డెంగ్యూ జ్వరాలు ప్రభలడంతో కలెక్టర్‌ రవి గురువారం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో వీధులన్నీ పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గ్రామాల్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రైడే పాటించా లన్నారు. అంతకు ముందు జ్వర పీడితుల ఇళ్లల్లోకి వెళ్లి వారితో మాట్లా డారు. జిల్లాలో ప్రతి రోజు 100ఇళ్లను సర్వే చేయడానికి 10మందిని ని యమించినట్లు తెలిపారు. గ్రామంలో గల పశువైద్యశాలను, ఆరోగ్యకేం ద్రం భవనంలోకి మార్చాలని, ఆరోగ్యకేంద్రంను పశువైద్యశాలకు మార్చా లని కలెక్టర్‌ను గ్రామస్థులు కోరారు. గ్రామ ప్రారంభంలో అవెన్యూ ప్లాం టేషన్‌ నిర్వహణపై కలెక్టర్‌ అగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ వెంట అడి షనల్‌ కలెక్టర్‌ అరుణశ్రీ, డీపీవో నరేశ్‌, డీఎంహెచ్‌వో శ్రీధర్‌, జడ్పీటీసీ కొండపల్కుల రామ్మోహన్‌రావు, తహసీల్దార్‌ సుజాత, ఎంపీడీవో శైలజా రాణీ, ఎంపీవో వాసవి సర్పంచ్‌ జలజ, ఎంపీటీసీ సఫీయాభేగం, మండల కో ఆప్షన్‌ సభ్యుడు అజర్‌, పంచాయితీ కార్యదర్శి శ్యామల ఉన్నారు.

Updated Date - 2021-08-20T06:07:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising