ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొరల చేతిలో బంధీగా తెలంగాణ

ABN, First Publish Date - 2021-06-22T06:13:42+05:30

కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దొరల చేతిలో బంధీగా మారి రాష్ట్రంలో నియంతృత్వ, నిరంకుశ పాలన సాగు తోందని ఉమ్మడి కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ అన్నారు.

కొండగట్టులో తుల ఉమకు స్వాగతం పలుకుతున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఫజడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ

మల్యాల, జూన్‌ 21: కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దొరల చేతిలో బంధీగా మారి రాష్ట్రంలో నియంతృత్వ, నిరంకుశ పాలన సాగు తోందని ఉమ్మడి కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ అన్నారు. రాబోయే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ గెలుపు త థ్యమని ఆమె అన్నారు. బీజేపీలో చేరిన తరువాత సోమవారం కొండ గట్టు అంజన్నను ఆమె దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆ మె కక్ష పూరిత రాజకీయాలు చేస్తూ, ప్రశ్నించే వారిని టార్గెట్‌ చేయ డంతో పాటు ఉద్యమకారులను దూరం చేశారని విమర్శించారు. ఉద్య మం తెలియని వారిని పక్కన పెట్టుకొని తెలంగాణ ప్రజల ఆత్మగౌర వాన్ని తాకట్టుపెట్టారని అన్నారు. రాష్ట్రంలో ప్రజావ్యవస్థ నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న సీఎం కేసీఆర్‌కు రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణ పాఠం చెప్పడం ఖాయమన్నారు. కొండగట్టులో నేడు శ్రీ స్వామి వారిని ఈటల గెలుపొం దాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో బింగి వేణు, నేరెళ్ల శ్రావణ్‌కుమార్‌, వనిత, రవి, పొన్నం మల్లేశంగౌడ్‌, రాజు, శ్రావ ణ్‌, గాజుల మల్లేశం, శ్రీనివాస్‌, చక్రంగౌడ్‌, రాజశేఖర్‌, హరీష్‌, తిరుపతి పాల్గొన్నారు

Updated Date - 2021-06-22T06:13:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising