షార్ట్ సర్క్యూట్‌తో ట్రాలీ ఆటో దగ్ధం
ABN, First Publish Date - 2021-01-11T04:31:16+05:30
మండలంలోని ఎల్‌ఎండీ కాలనీ వద్ద రాజీవ్ రహ దారిపై ఓ ట్రాలీ ఆటో షా ర్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది.
తిమ్మాపూర్, జనవరి 10: మండలంలోని ఎల్‌ఎండీ కాలనీ వద్ద రాజీవ్ రహ దారిపై ఓ ట్రాలీ ఆటో షా ర్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. కరీంనగర్ అరెపల్లికి చెంది న సైండ్ల శ్రీనివాస్ ట్రాలీ ఆటోను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీ నివాస్ ఆదివారం ఏపీ 15 టీఏ 9253 నంబరు గల ట్రాలీ ఆటోలో సెంట్రిగ్ కట్టె తీసుకొని గన్నేరువరం మం డలం చిమలకుంటపల్లికి బయలు దేరాడు. ఎల్‌ఎండీ కాలనీ వద్ద ఆటో ముందు భాగం నుంచి పొగలు రావడాన్ని గమనించిన శ్రీనివాస్ ఆటోను నిలిపివేసి కిందికి దిగాడు. అంతలోనే మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపివేశారు. సుమారు రెండు లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు శ్రీనివాస్ వెల్లడించారు.
Updated Date - 2021-01-11T04:31:16+05:30 IST