ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి కుటుంబం లబ్ది పొందేలా సంక్షేమ పథకాలు

ABN, First Publish Date - 2021-10-07T06:12:47+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబం లబ్ధి పొందేలా ఉన్నాయని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

హుజూరాబాద్‌లో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 -  మంత్రి గంగుల కమలాకర్‌

హుజూరాబాద్‌, అక్టోబరు 6: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబం లబ్ధి పొందేలా ఉన్నాయని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం బోర్నపల్లి-సైదాపూర్‌  రోడ్డు పనులను ఆయన అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ప్రజల విజ్ఞప్తుల్ని ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ ఏనాడు పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ సాధించిన స్వరాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. 60 ఏళ్లలో రాని మార్పులు ఆరేళ్లలో చేసి చూపించారన్నారు. హుజూరాబాద్‌లో ఇప్పటికే 350 రోడ్ల పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజలు ఆలోచన చేసి పని చేసే ప్రభుత్వానికి మద్దతివ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వడ్లూరి విజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గందె శ్రీనివాస్‌, దొంత రమేష్‌, సందమల్ల బాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-07T06:12:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising