ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ యూటర్న్‌!

ABN, First Publish Date - 2021-10-08T07:40:28+05:30

మేనిఫెస్టోలోనూ అదే అంశం ఉంది.’’ అని ప్రకటించారు. వాస్తవానికి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే దళితులకు 3 ఎకరాల భూమిపై సర్కారు నెమ్మదిగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దళితులకు 3 ఎకరాలపై వెనక్కి.. భూమి ఉండాలన్నాం తప్ప ఇస్తామనలేదన్న సీఎం

భూమి లేని ప్రతి ఎస్సీ కుటుంబానికీ3 ఎకరాలు సాగుకు యోగ్యమైన భూ వసతి కల్పిస్తాం. సాగుకు కావాల్సిన నీరు, కరెంటు, విత్తనాలు.. మొదటి ఏడాదికి కావాల్సిన పెట్టుబడి తదితర సదుపాయాలన్నీ ప్రభుత్వం అందిస్తుంది. కుటుంబంలోని మహిళ పేరుమీద పట్టా ఇస్తుంది.

..2014 టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో హామీ

దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని ఈ గోల్కొండ కోట నుంచే మీ అందరి సమక్షంలో నేడు నేను శ్రీకారం చుట్టబోతున్నాను. ఈ పథకాన్ని ఇవ్వాల అన్ని జిల్లాల్లో మంత్రులు ప్రారంభించి దళిత సోదరులకు పాసుబుక్కులిస్తారు.

...2014 ఆగస్టు 15న గోల్కొండ కోట సాక్షిగా సీఎం కేసీఆర్‌ ప్రకటన


అర, ఎకరం, ఎకరన్నర భూమి ఉన్న దళిత కుటుంబాలకు మిగతా మొత్తం మేము సమకూర్చి మూడు ఎకరాలు చేస్తాం. ఇప్పుడు ఆ ఫేజ్‌  ప్రారంభం అయింది.

...2015 మార్చి 17న అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటన

..ఇలా దళితులకు మూడెకరాల సాగుభూమిపై ఇన్నిసార్లు విస్పష్టంగా హామీలిచ్చి, ప్రకటనలు చేసిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని తామెన్నడూ హామీ ఇవ్వలేదంటూ మంగళవారం(అక్టోబరు 5న) నిండు అసెంబ్లీలో కుండ బద్దలు కొట్టేశారు. ‘‘దళితులకు 3 ఎకరాల భూమి వాగ్దానం మేము ఎప్పుడూ చేయలేదు. కొంత మంది ఇష్టానుసారంగా అనేస్తారు. నేను మాట్లాడిన మాటలు రికార్డులో ఉన్నాయి. గత ప్రభుత్వాలు అనుసరించిన భూ కేటాయింపుల విధానాలు అశాస్త్రీయంగా ఉన్నాయి.


కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు భూ కేటాయింపులు ఉం టాయి. కానీ గత ప్రభుత్వాలు ఒకరికి రెండు ఎకరాలు, ఒకరికి ఎకరం, మరికొందరికి అర ఎకరం ఇలా ఇష్టానుసారంగా కేటాయించింది. దళితులే కాదు ఏ సామాజిక వర్గానికి భూమి ఇవ్వాలన్నా కనీసం రెండున్నర నుంచి మూడు ఎకరాలు ఉండాలని అధ్యయనాల్లో తేలింది. అదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడిన. ఒకవేళ దళిత కుటుంబం వద్ద ఎకరా భూమి ఉంటే రెండు ఎకరాలు కొనిస్తాం. రెండున్నర ఎకరాలు ఉంటే ఇంకో అర ఎకరం కొనిస్తామని హామీ ఇచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోలోనూ అదే అంశం ఉంది.’’ అని ప్రకటించారు. వాస్తవానికి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే దళితులకు 3 ఎకరాల భూమిపై సర్కారు నెమ్మదిగా వెనక్కు తగ్గుతూ వస్తోంది. భూమి ఇవ్వడం సాధ్యం కాదని చివరికిప్పుడు తేల్చిచెప్పేసింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ‘దళిత బంధు’ పథకం చేపట్టి ఇతర వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్‌.. ఇప్పుడీ ప్రకటనతో దళితుల నుంచి కూడా వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. కాగా.. ఇంతకాలం 3 ఎకరాల భూమి కోసం ఎదురుచూసిన దళిత కుటుంబాలు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో చేసిన తాజా వ్యాఖ్యలతో ఆ హామీపై ఆశలు వదులుకుంటున్నాయి. తమకు ఏదో మేలు జరుగుతుందని ఇంతకాలం ఆశతో ఎదురుచూశామని.. కానీ ఎప్పటిలాగే మోసపోయామని దళితులు నిట్టూరుస్తున్నారు.


2.2శాతం కుటుంబాలకే భూమి..

రాష్ట్రంలో 3 లక్షల దళిత కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదనే విషయం 2014లో సమగ్ర కుటుంబ సర్వేలో తెలిసింది. దీంతో వారికి 3 ఎకరాల భూమి ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. అది జరిగి 7 సంవత్సరాలు కాగా.. ఇప్పటిదాకా రాష్ట్రంలో మూడెకరాల భూమి దక్కిన దళిత కుటుంబాల సంఖ్య 7 వేలలోపే కావడం గమనార్హం. అంటే.. ఇంచుమించుగా 2.2 శాతానికి మాత్రమే ప్రభుత్వంభూమిని కేటాయించింది. ఇక ఈ పథకం కోసం ఏటా బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయిస్తామని 2014లో ప్రకటించిన ప్రభుత్వం.. ఈ ఏడేళ్లల్లో ఖర్చు చేసింది రూ.755.94 కోట్లు మాత్రమే. అంటే.. కేటాయిస్తామని చెప్పిదాంట్లో దాదాపు పదో వంతే! సీఎం తాజా ప్రకటన నేపథ్యంలో ఇక ఈ పథకానికి.. గతంలో ప్రకటించినట్లుగా నిధులు కేటాయిస్తారనే ఆశ సన్నగిల్లినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌

Updated Date - 2021-10-08T07:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising