కవి నిఖిలేశ్వర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
ABN, First Publish Date - 2021-03-13T02:30:58+05:30
2020 సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించారు. 20 భాషల్లో సాహిత్య అకాడమీ పురస్కారాలు ఇచ్చారు. ప్రముఖ కవి నిఖిలేశ్వర్‌కు
హైదరాబాద్: 2020 సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించారు. 20 భాషల్లో సాహిత్య అకాడమీ పురస్కారాలు ఇచ్చారు. ప్రముఖ కవి నిఖిలేశ్వర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలుగులో నిఖిలేశ్వర్ రచించిన అగ్నిశ్వాస కవిత్వానికి అవార్డు ఇచ్చారు. నిఖిలేశ్వర్ అసలు పేరు కుంభం యాదవరెడ్డి. నిఖిలేశ్వర్ కవిగానే కాకుండా అనువాదకుడు, కథకుడు, విమర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1956 నుంచి 1964 వరకు తన అసలు పేరుతో వివిధ రచనలు చేశారు. 1965 నుంచి తన కలం పేరును నిఖిలేశ్వర్‌గా మార్చుకుని దిగంబర కవిగా విరజిల్లారు.
విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో నిఖిలేశ్వర్ ఒకరు. విప్లవకవిగానే కాకుండా పౌరహక్కుల ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారు. 1971లో ‘మీసా’ చట్టం కింద అరెస్ట్ అయ్యారు. దిగంబరకవులు, మండుతున్న తరం, ఈనాటికీ, నాలుగు శతాబ్దాల సాక్షిగా మహానగరం, ఎవరీ శత్రువులు, జ్ఞాపకాల కొండ, ఖండాంతరాల మీదుగ, యుగస్వరం, కాలాన్ని అధిగమించి, నిఖిలేశ్వర్ కవిత్వం, అగ్నిశ్వాస లాంటి కవితా సంపులను నిఖిలేశ్వర్ రచించారు.
కన్నెగంటి అనసూయకు బాలసాహితి పురస్కారం, ఎండ్లూరి మానసకు యువ పురస్కారం లభించింది. మిలింద షార్ట్ స్టోరీని మానస ఎండ్లూరి రచించారు. 18 భాషల్లో 2020 సాహిత్య అకాడమీ యువ పురస్కారాలు ఇచ్చారు.
Updated Date - 2021-03-13T02:30:58+05:30 IST