మిర్చిసాగు రైతులకు నష్ట పరిహారం ఇవ్వాల్సిందే
ABN, First Publish Date - 2021-12-20T04:48:29+05:30
మిర్చి రైతులకు ప్రకృతి విపత్తు వలన తీవ్రనష్టం జరిగిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోయిన రైతులందరికి పరిహారం క్రింద రూ. లక్ష ఇవ్వాల్సిందేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తెలిపారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
కొణిజర్ల,డిసెంబరు19: మిర్చి రైతులకు ప్రకృతి విపత్తు వలన తీవ్రనష్టం జరిగిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోయిన రైతులందరికి పరిహారం క్రింద రూ. లక్ష ఇవ్వాల్సిందేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తెలిపారు. మండల పరిధిలోని లాలాపురంలో ఆదివారం దెబ్బతిన్న మిర్చితోటలను సీపీఎం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ ఈ ఏడాది మిర్చికి వైరస్‌తో పాటు గులాబి, తామర, పురుగులతో ఎర్రనల్లి, నల్లనల్లి సోకి మిర్చి పంట తీవ్రనష్టాన్ని మిగిల్సిందన్నారు. ఖమ్మంజిల్లాలోనే లక్ష ఎకరాల్లో మిర్చినష్టం జరిగిందని తెలిపారు. మిర్చి రైతులకు పరిహారం చెల్లించేవరకు ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. నేడు కలెక్టరేట్ ముందు ధర్నా జరుగుతుందని, రైతులు స్పచ్చందంగా హజరుకావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, భూక్య వీరభద్రం, తాళ్ళపల్లి కృష్ణ, చింతనిప్పు చలపతి, సంక్రాంతి నర్సయ్య, సంక్రాంతి పురుషోత్తం, బాలాజి, శ్రీనువాస్, శ్రీహరి, రవి, నాగేశ్వరరావు, దర్గా, బాబు, నర్సయ్య, గోపాల్‌రావు, వినయ్, సిద్ద పాల్గొన్నారు.
మిర్చితోటలను పరిశీలించిన సీపీఎం బృందం
ఎర్రుపాలెం: మండలంలోని పలు గ్రామాలలలో గల మిర్చి తోటలను సీపీఎం బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా భీమవరం గ్రామంలో నష్టపోయిన రైతులను పరామర్శించారు. వారు మాట్లాడుతూ మిర్చి పంటను జాతీయ విపత్తుగా పరిగణించి నష్టపోతున్న మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు. నష్టపోయిన ప్రతి రైతుకు లక్ష రూపాయలు నష్టపరిహారంగా అందచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి గొల్లపుడి కోటేశ్వరరావు, నాయకులునల్లమోతు హనుమంతరావు, జాని, అనుమోలు వెంకటేశ్వరరావు, యరమల వెంకట నారాయణరెడ్డి, కిషోర్, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, సొసైటీ డైరెక్టర్ గొల్లపుడి శ్రీహరి పాల్గొన్నారు.
మిర్చితోట తొలగింపు
ముదిగొండ: మండలంలోని బాణాపురం గ్రామంలో రైతు చిలకల బూషి మూడెకరాలు కౌలుకు తీసుకొని మిరప సాగుచేపట్టాడు. కౌలు, ఎరువులు, పురుగు మందులు తదితర ఖర్చులతో ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. అనుకోని విధంగా మిరపకు తామర పురుగు, నల్లి సోకటంతో పూర్తిగా నాశనమైంది. ఎన్ని పురుగులమందులు వాడినా ఫలితం లేకపోవడంతో ఆదివారం మిరప తోటను ట్రాక్టర్‌తో దున్నేశాడు.
Updated Date - 2021-12-20T04:48:29+05:30 IST