ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి ధర పైపైకి..

ABN, First Publish Date - 2021-12-31T05:50:28+05:30

పత్తి ధర పైపైకి..

ఖమ్మం మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన పత్తి బస్తాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం మార్కెట్‌లో క్వింటా రూ.9,100

జూలూరుపాడులో రూ.9050 పలికిన తెల్లబంగారం

మరింత పెరగొచ్చని వ్యాపారుల అంచనా

ఖమ్మం మార్కెట్‌/జూలూరుపాడు, డిసెంబరు 30: దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరగడంతో తెల్లబంగారం ధర పరుగులు పెడుతోంది. ఈ సీజన్‌లోనే అత్యధికంగా గురువారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా పత్తిని రూ.9,100లకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా వ్యాపారులు కొనుగోలు చేశారు. పత్తికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర రూ.6,025 ఉండగా.. అంతకన్నా ఎక్కువగా.. గత రెండు రోజులు వరుసగా క్వింటా రూ.9,000కు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో గురువారం క్వింటాకు మరో రూ.100 పెంచి కొన్నారు. రానున్న రోజుల్లో క్వింటా పత్తి రూ.10వేల వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ ఏడాది పత్తిసాగు తగ్గడంతో పాటు వాతావరణ పరిస్థితులతో దిగుబడి కూడా తగ్గడంతో పత్తికి డిమాండ్‌ పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. పత్తి ధర పెరుగుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మార్కెట్‌కు సుమారు 5 వేల పత్తి బస్తాలు అమ్మకానికి రాగా.. కొనుగోళ్లను మార్కెట్‌ చైర్‌పర్సన్‌ డౌలే లక్ష్మీప్రసన్న, సెక్రెటరీ రుద్రాక్షి మల్లేశం, అసిస్టెంట్‌ సెక్రెటరీ రాజేంద్రప్రసాద్‌, యూడీసీ శ్రీనివాస్‌ తదితరులు పర్యవేక్షించారు. ఇక భద్రాద్రి జిల్లా జూలూరుపాడు ఉపమార్కెట్‌ యార్డులో గురువారం క్వింటా పత్తి గరిష్ఠంగా రూ.9050 పలికింది. 

Updated Date - 2021-12-31T05:50:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising