డీఎంఈఏ నూతన కమిటీ ఎన్నిక
ABN, First Publish Date - 2021-10-10T17:57:11+05:30
సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని అన్ని గనుల డిప్లొమా మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన కమిటీని బాంబే కాలనీలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం ఎన్నుకున్నారు.
మణుగూరుటౌన్(భద్రాద్రి కొత్తగూడెం): సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని అన్ని గనుల డిప్లొమా మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన కమిటీని బాంబే కాలనీలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం ఎన్నుకున్నారు. 14 మంది కార్యవర్గ సభ్యులు, 19 మంది కౌన్సిల్ సభ్యులతో కమిటీని ఎన్నుకున్నారు. మైన్ కార్యదర్ములుగా పీకేవోసీ-2 సీహెచ్ క్రాంతికుమార్, పీకేవోసీ-4 సామ్యూల్, మణుగూరు ఓసీకి కృష్ణ, కొండాపురం యూజీ మైన్‌కు మనోహార్‌రెడ్డి ఎన్నికయ్యారు. సమావేశంలో అన్ని గనులకు చెందిన అసోసియేషన్ సభ్యులు, మణుగూరు ఏరియాలో డీఎంఈఏ ఇన్‌చార్జ్ ఎస్‌కే దౌలత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ యుగంధర్, కోశాధికారి దుర్గా వరప్రసాద్ హాజరయ్యారు.
Updated Date - 2021-10-10T17:57:11+05:30 IST