ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి పనులను మరింత విస్తరించాలి

ABN, First Publish Date - 2021-11-24T04:31:04+05:30

ఉపాధి హామీ పథకం , చట్టం ప్రాధాన్యతను గుర్తించి క్షేత్రస్థాయిలో ఎన్నార్‌ ఈజీఎస్‌ పనులను మరింత విస్తరింప చేయాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ కోరారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌  గౌతమ్‌

ఉపాధి పనులపై ఎంపీడీవోలకు శిక్షణ

ఖమ్మంకలెక్టరేట్‌, నవంబరు23: ఉపాధి హామీ పథకం , చట్టం ప్రాధాన్యతను గుర్తించి క్షేత్రస్థాయిలో ఎన్నార్‌ ఈజీఎస్‌ పనులను మరింత విస్తరింప చేయాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ కోరారు. పథకం, చట్టం ప్రాధాన్యత పట్ల అవగాహన పెంపొందించుకునేందుకు జిల్లా గ్రామీణా భివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టీటీడీసీ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యతిథిగా విచ్చేసిన కలెక్టర్‌  గౌతమ్‌ మాట్లాడుతూఎన్నార్‌ఈజీఎస్‌ పథకం ప్రాధాన్యత చట్టం గురించి వివరించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 15 ఏళ్ల క్రితం ఈ చట్టాన్ని తీసుకొచ్చారని, ఇప్పటికి పథకం ప్రాధాన్యత రోజురోజుకీ మరింత పెరుగుతోందన్నారు. నిరుపేద కూలీల అభివృద్ధికి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. గ్రామ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా ఉన్నప్పుడే సమాజం మెత్తం ఆర్థికంగా బలోపేతం అవుతుందన్నారు. అధిక పనిదినాలు కల్పించే విధంగా ఎంపీడీవోలు మరింత బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వర్తించాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన మాట్లాడుతూ జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం పట్ల అవగాహన కల్పించేందుకు ఈనెల 23నుంచి 25 వరకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోన్నట్లు చెప్పారు. ఈ సదస్సులో జడ్పీ సీఈవో వింజం వెంకట అప్పారావు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు ఈసీలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-24T04:31:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising