ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేనున్నానని.. మీకేం కాదని

ABN, First Publish Date - 2021-09-17T05:37:41+05:30

చిన్నపాటి వర్షాలు కురిసినా మండలంలో వాగులు, వంకలు ఏడాదంతా పారుతూనే ఉంటాయి. చెరువులు నిండు కుండలను తలపిస్తాయి.

ఎమ్మెల్యే మెచ్చా చేతుల మీదుగా రైతులకు మోటార్లు పంపిణీ చేస్తున్న ప్రసాదరావు(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదివాసీ రైతుల కరెంట్‌ కష్టాలు తీర్చిన మాజీ మంత్రి ప్రసాదరావు

జేవీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ములకలపల్లిలో 32 విద్యుత్‌ మోటార్ల అందజేత

మారుమూల గ్రామాల్లో త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్ల నిర్మాణం

ములకలపల్లి, సెప్టెంబరు 16: చిన్నపాటి వర్షాలు కురిసినా మండలంలో వాగులు, వంకలు ఏడాదంతా పారుతూనే ఉంటాయి. చెరువులు నిండు కుండలను తలపిస్తాయి. నీరు పక్కనే ఉన్నా.. త్రీఫేజ్‌ విద్యుత్‌ సౌకర్యం లేదు.. ఆదివాసీ రైతుల కష్టాలు తెలుసుకున్న మాజీ మంత్రి జలగం ప్రసాదరావు వారి అభివృద్ధికి బాటలు వేయాలని సంకల్పించారు.. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పేరుమీద ‘జేవీఆర్‌’ పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసి రైతులకు త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్లు సౌకర్యం కల్పించారు. పామలేరువాగులో ఫిల్టర్లు ఏర్పాటు చేసి మోటార్లు ఉచితంగా పంపిణీ చేశారు. ముక్కారు పంటల సాగుకు బీజం వేశారు.

జలగం ప్రసాద్‌ ‘చొరవ’తో..

మాజీ మంత్రి జలగం ప్రసాదరావు చొరవతో మండలంలోని చౌటిగూడెం, రంగాపురం, మొండివర్రె, గుండాలపాడు, రాచన్న పేట, రాచన్న గూడెం, వెలకంవారి గుంపునకు 250 విద్యుత్‌ స్తంభాలు, ఆరు ట్రాన్స్‌ఫార్లర్లు ఏర్పాటు చేసి త్రీఫేజ్‌ లైన్‌ ఏర్పాటు చేశారు. తాళ్లపాయి పంచాయతీలోని తాళ్లపాయి, రింగిరెడ్డిపల్లి, మంగళిగుట్టలో 80 విద్యుత్‌ స్తంభాలు, 4 ట్రాన్స్‌ఫార్మర్లతో త్రీఫేజ్‌ విద్యుత్‌లైన్‌ ఏర్పాటు చేశారు. రైతుల నుంచి వాటాధనంగా సర్వీస్‌ కనెక్షన్‌ ఛార్జిగా రూ.5,200తో డీడీ తీస్తే విద్యుత్‌ శాఖ అధికారులు త్రీఫేజ్‌ లైను ఏర్పాటు చేశారు.

‘జేవీఆర్‌’ ట్రస్టు ద్వారా రైతులకు ఉచితంగా మోటార్లు పంపిణీ..

జలగం వెంగళరావు ట్రస్టు (జేవీఆర్‌) ద్వారా మండలంలో 32 మంది ఆదివాసీ రైతులకు 32 5 హెచ్‌పీ మోటార్లు ఉచితంగా, మరో ఐదుగురికి 7.5౅ హచ్‌పీ 50శాతం రాయితీతో పంపిణీ చేశారు. మూకమామిడి, బొంతగూడెం, ఎర్రప్పగుంపు, వెలకంవారిగుంపు, ఒడ్డుగూడెం రైతులు పదిమందికి 5హెచ్‌పీ 10 మోటార్లు ఉచితంగా,  7.5 హెపీ మోటా ర్లు ఐదుగురు రైతులకు 50శాతం రాయితీతో పంపిణీ చేశారు. తాళ్లాపాయి, రింగిరెడ్డిపల్లి, తాళ్లాపాయి, మంగళిగుట్ట రైతులకు పాములేరు వాగులో 25 అడుగులు ఫిల్టర్‌ ఏర్పాటు చేసి 22 మంది రైతులకు 22 (5హెచ్‌పీ) మోటార్లు ఉచితంగా పంపిణీ చేశారు.. 

ఆదివాసీల అభివృద్ధే ప్రధాన ధ్యేయం: జలగం ప్రసాదరావు, మాజీ మంత్రి

ఆదివాసీలంటే నాన్నకు ప్రేమ ఎక్కువ. ములకలపల్లి ఆయనకు ప్రత్యేకం. గతంలో మూకమామిడి ప్రాజెక్టు, మంగపేట పీహెచ్‌సీ ఆయనే ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆర్థికంగా రైతుబంధు ఇస్తున్నా, విద్యుత్‌ సౌకర్యం లేక ఇబ్బందులు పడేవారు. రైతులు బాగుంటేనే దేశం బాగుటుంది. జేవీఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా ఏజెన్సీ రైతులకు సేవ చేయాలనేదే నా ధ్యేయం. మోటార్లు, విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తే రైతులకు రెండు పంటలు పండించుకుంటున్నారు. గిరిజన విద్యార్థులు ఉన్నత చదువుకోసం ఆర్థిక సహాయం చేసేందుకు ట్రస్టు సిద్ధంగా ఉంది. 

Updated Date - 2021-09-17T05:37:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising