ఆంధ్రాకు తెలంగాణ పామాయిల్ గెలలు
ABN, First Publish Date - 2021-05-04T05:32:57+05:30
పామాయిల్ గెలలను ఆంధ్రాకు చెందిన కొందరు రైతులు ఓ ప్రైవేటు ఫ్యాక్టరీకి సోమవారం అక్రమంగా తరలిస్తుండటంతో మండల పరిదిలోని అల్లిపల్లి వద్ద ఆయిల్‌పెడ్ అధికారులు పట్టుకున్నారు.
అధిక ధర వస్తోందని కౌలు రైతుల తరలింపు
సరిహద్దు ప్రాంతంలో అడ్డుకున్న అధికారులు
దమ్మపేట, ఏప్రిల్ 3 : పామాయిల్ గెలలను ఆంధ్రాకు చెందిన కొందరు రైతులు ఓ ప్రైవేటు ఫ్యాక్టరీకి సోమవారం అక్రమంగా తరలిస్తుండటంతో మండల పరిదిలోని అల్లిపల్లి వద్ద ఆయిల్‌పెడ్ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణ ప్రాంతంలోని పామాయిల్ గెలలను ప్రైవేటు ప్యాక్టరికి ఎలా తరలిస్తారంటూ ఆంధ్రా రైతులను నిలదీశారు. సమాచారాన్ని అయిల్‌ఫెడ్ మేనేజర్లు, శ్రీకాంతరెడ్డి, బాలకృష్ణకు సమాచారం అందించటంతో వారు అక్కడికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న పామాయిల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రాంచంద్రప్రసాద్ సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో పండిన పామాయిల్ గెలలను ఇక్కడి ఫ్యాక్టరీకి తరలించకుండా ఆంధ్రాకు ఎందుకు తీసుకెళ్తున్నారని నిలదీశారు. తాము ఆంధ్రా ప్రాంతానికి చెందిన కౌలు రైతులమని, మాకు తెలంగాణలో ఫ్యాక్టరీకంటేటన్నుకు రూ.1000 అదనంగా వస్తున్నాయని అందువల్లే అక్కడ విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా ఆయిల్‌ఫెడ్ అధికారులు కల్పించుకుంటూ మీకు అదనంగా ఎలా ఇస్తున్నారో? ఎవరు ఇస్తున్నారో చెప్పాలంటూ రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఫ్యాక్టరీ అధికారులను పిలిపించడంటూ నిలదీశారు. తెలంగాణలోని పామాయిల్ తరిలించుకుపోయేందుకు ఆంధ్రా ప్రాంతంలోని ప్రైవేట్ ఫ్యాక్టరీ యజమానులను రైతులను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. కౌలుకు తీసుకున్న మీరు ఆంధ్రాప్రాంతానికి చెందిన వారైనా ఇక్కడ ఫ్యాక్టరీకి మాత్రమే తరలించాలన్నారు. దీంతో కౌలు రైతులు పామాయిల్ గెలల ట్రాక్టర్‌ను అప్పారావుపేట ఫ్యాక్టరీకి తరలించడంతో పాటు మరొకసారి ఆంధ్రా ప్రాంతానికి గెలలను తరలించబోమని కౌలు రైతులు హామీ ఇవ్వడంతో వివాదం సర్దుమణిగింది.
Updated Date - 2021-05-04T05:32:57+05:30 IST