ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరీక్షణ.. నిరసన

ABN, First Publish Date - 2021-07-20T05:40:19+05:30

ఏపీ నుంచి అశ్వారావుపేట, అప్పారావుపేట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలకు పామాయిల్‌ గెలల అక్రమ రవాణా జరుగుతోంది. నిత్యం వందల వాహనాల్లో వస్తుండటం పట్ల తెలంగాణ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అప్పారావుపేట ఫ్యాక్టరీకి తాళం వేసిన రైతులు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ నుంచి అక్రమంగా పామాయిల్‌ గెలల రవాణా

అశ్వారావుపేట, అప్పారావుపేటలో ఫ్యాక్టరీల వద్ద పెరుగుతున్న రద్దీ

అక్కడి పంటకే యాజమాన్యం ప్రాధాన్యమిస్తోందని రైతుల ఆరోపణ

ఫ్యాక్టరీ గేటుకు తాళం వేసి స్థానిక రైతుల ఆందోళన

అశ్వారావుపేట, జూలై 19: ఏపీ నుంచి అశ్వారావుపేట, అప్పారావుపేట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలకు పామాయిల్‌ గెలల అక్రమ రవాణా జరుగుతోంది. నిత్యం వందల వాహనాల్లో వస్తుండటం పట్ల తెలంగాణ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుమతి కావడానికి ఒక్కోసారి రెండు రోజుల సమయం పడుతుండగా.. ఆదివారం ఉదయం ఫ్యాక్టరీకి వచ్చిన తెలంగాణ రైతుల వాహనాలు.. రాత్రి 9గంటలు దాటినా దిగుమతి కాకపోవడంతో స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి ఉందని, ఏపీనుంచి వస్తున్న గెలలకు ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రాధాన్యమిస్తూ తమ పంటను దిగుమతి చేసుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అశ్వారావుపేట ఫ్యాక్టరీ గేటుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. ఏపీ నుంచి పామాయిల్‌ గెలల రవాణా నిలిపేయాలని స్థానిక రైతులు డిమాండ్‌ చేశారు.

‘ఫ్రూట్‌కోడ్‌’ దుర్వినియోగం

 కొద్దిరోజుల క్రితం వరకు ఏపీకి చెందిన పామాయిల్‌ గెలలకు రవాణా పేరుతో అదనంగా టన్నుకు రూ.2వేలు చెల్లించి ఆయిల్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది. అంతే కాకుండా ఏపీకి చెందిన చాలామంది తెలంగాణాలోని తోటలను కౌలుకు తీసుకొని ప్రూట్‌కార్డులను పొందారు. ప్రూట్‌ కోడ్‌నెంబర్‌ ఉంటే పామాయిల్‌ గెలలను నిక్షేపంగా ఫ్యాక్టరీలో అమ్ముకోవచ్చును. మరి కొందరు తెలంగాణలో తోటలు లేకపోయిన కౌళ్లు చేస్తున్నట్టు అక్రమంగా అనుమతులు సృష్టించుకొని ఫ్యాక్టరీనుంచి ప్రూట్‌ కోడ్‌లను పొందినట్టు ఆరోపణలున్నాయి. దీనికి తోడు స్థానికంగా ఉన్న రైతులకు ఏపీకి చెందిన రైతులతో ఉన్న బంధుత్వాల కారణంగా కూడా కొందరు ఇక్కడి వారి పేరిట ఏపీ గెలలను తీసుకొస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని తోటల నుంచే భారీస్థాయిలో దిగుబడి వస్తుండగా.. అటు ఏపీ గెలలు ఒక్కసారిగా వస్తుండటంతో ఫ్యాక్టరీ క్రషింగ్‌ సామర్థ్యానికి మించి రెండు మూడు రెట్లు గెలలు వస్తున్నాయి. దీంతో గెలలు పేరుకుపోతున్నాయి. దీంతో ప్లాట్‌పామ్‌లు ఖాళీలేక దిగుమతులు జరగడం లేదు. ఏపీ నుంచి వచ్చే గెలల వల్లనే దిగుమతుల్లో ఆలస్యం జరుగుతోందని గమనించిన స్థానిక రైతులు ఏపీ గెలల కొనుగోళ్లను తక్షణమే నిలపివేయాలంటూ ఆదివారం రాత్రి ఫ్యాక్టరీ గేటుకు తాళం వేశారు. సోమవారం ఉదయం పామాయిల్‌ రైతు సంఘ నాయకులు ఫ్యాక్టరీకి వెళ్లి ఏపీకి చెందిన గెలలు కొనొద్దని, నిబంధనల ప్రకారం ఫ్యాక్టరీ పరిధిలోని గెలలను మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఏపీ నుంచి వచ్చేగెలల కొనుగోళ్లు నిలిపేసినా కొందరు తెలంగాణ  రైతుల పేరుతో అక్రమంగా తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయిల్‌ఫెడ్‌ అధికారులు ఏపీ నుంచి పండు రాకుండా ఉండేందుకు సరిహద్దులో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.  

Updated Date - 2021-07-20T05:40:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising