ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తోడు దొంగల్ని దౌడు తీయిస్తాం!

ABN, First Publish Date - 2021-12-19T07:02:45+05:30

‘‘లీటరు పెట్రోలు 2014లో 60 రూపాయలు! ఇప్పుడు రూ.110 దాటింది. అప్పట్లో గ్యాస్‌ సిలిండర్‌ రూ.450.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పెట్రోలు అప్పుడు 60 ఇప్పుడు 110.. 
  • వంట గ్యాస్‌ అప్పుడు 450 ఇప్పుడు 1000 
  • కేసీఆర్‌, మోదీ దోపిడీ 32 లక్షల కోట్లు..
  •  పింఛన్‌ 2 వేలిచ్చి 6 వేలు లాక్కుంటున్న కేసీఆర్‌ 
  • సరుకుల ధరలు తగ్గించే వరకూ పోరు..  
  • అగ్గి పుట్టిస్తానన్న సీఎం పెగ్గు తాగి పండుకున్నడు
  • టీఆర్‌ఎస్‌ చెరువుకు గండి పడింది: రేవంత్‌.. 
  • చేవెళ్ల మండలంలో నిరసన పాదయాత్ర


రంగారెడ్డి అర్బన్‌/చేవెళ్ల/మొయినాబాద్‌/ షాబాద్‌, డిసెంబరు 18: ‘‘లీటరు పెట్రోలు 2014లో 60 రూపాయలు! ఇప్పుడు రూ.110 దాటింది. అప్పట్లో గ్యాస్‌ సిలిండర్‌ రూ.450. ఇప్పుడు వెయ్యి రూపాయలకు చేరింది. అప్పట్లో జేబులో పైసలు తీసుకుని బజారుకు పోతే సంచీ నిండా సరుకులు వచ్చేవి. ఇప్పుడు సంచీ నిండా డబ్బులు తీసుకెళ్లినా చేతి నిండా సరుకులు రావడం లేదు. అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్‌ ఇద్దరూ తోడు దొంగలు. ఇద్దరూ కలిసి దోచుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు కలిసి ఎనిమిదేళ్ల పాలనలో పన్నుల రూపంలో రూ.32 లక్షల కోట్లు దోచుకున్నాయి’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని, నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యులపై తీవ్ర భారం మోపుతున్నారని మండిపడ్డారు. నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శనివారం చేపట్టిన ఒకరోజు నిరసన పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. 


చేవెళ్ల మండలం ముడిమ్యాల నుంచి చేవెళ్ల వరకు 4 గంటల వ్యవధిలో 10 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా, చేవెళ్ల మండలం కౌకుంట్ల ఎంపీటీసీ కావలి సుజాతతోపాటు పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంటస్వామి కుమారుడు మాజీ సర్పంచ్‌ ప్రభాకర్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ రాములుతోపాటు పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరారు. షాబాద్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ముగింపు సభలో రేవంత్‌ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోదీ.. వాటి ఊసే ఎత్తడం లేదని, ఆయన చెప్పిన లెక్క ప్రకారమే ఇప్పటి వరకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని అన్నారు. అధికారంలోకి వస్తే విదేశాల్లోని నల్లధనాన్ని బయటకు తీసి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన మోదీ ఇప్పటికీ పది పైసలు కూడా వేయలేదని విమర్శించారు. 


అగ్గి కాదు.. పెగ్గు

ఢిల్లీలో అగ్గి పుట్టిస్తానని సీఎం కేసీఆర్‌ అన్నారని, అగ్గి పుట్టించలేదు కానీ ఫాంహౌ్‌సలో పండుకుని పెగ్గు తాగుతున్నాడని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల వడ్లు కొనే వరకూ కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ‘‘రాష్ట్రంలో రైతులు పంటలకు మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి పరిస్థితి అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిగా మారింది. వడ్ల కుప్పల మీదనే రైతులు ప్రాణాలు విడుస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పార్లమెంట్‌లో నిలదీయాల్సిన అధికార పార్టీ సభ్యులు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. వృద్ధులకు రూ.2000 పింఛన్‌ ఇచ్చి మద్యం ధరలు భారీగా పెంచారని, పన్నుల రూపంలో రూ.6000 లాక్కుంటున్నారని ఆరోపించారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించానని చెబుతున్న కేసీఆర్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వం డిజైన్‌ చేసిన చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టును రద్దు చేసి ఇక్కడి రైతులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు.


 అధికార పార్టీ నుంచి కాంగ్రె్‌సలోకి వలసలు మొదలయ్యాయని, టీఆర్‌ఎస్‌ చెరువుకు గండి పడిందని, ఆ పార్టీ పరిస్థితి ఇక చేవెళ్ల బస్టాండేనని అన్నారు. అధికారంలోకి వస్తే 111 జీవోను రద్దు చేస్తానని అన్నారని, ఇప్పటి వరకూ ఆ ఊసే లేదని తప్పుబట్టారు. అక్కడ పేదలు ఇళ్లు కట్టుకుంటే కూల్చేస్తున్నారని, కానీ, 25 ఎకరాల్లో కేటీఆర్‌ మాత్రం ఫాంహౌస్‌ కట్టుకున్నారని విమర్శించారు. కాగా, కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలను నిలదీయాలని రేవంత్‌ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ పాలనలో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిత్యావసరాల ధరలు అధికంగా పెరగడంతో సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని సీడబ్ల్యూసీ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. సామాన్యుల పక్షాన కాంగ్రెస్‌  పోరాటం చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపడుతూ ప్రజలపక్షాన పోరాటం చేస్తు న్న కాంగ్రె్‌సకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. 


ఎంబీఏ చదివినా నా కొడుకుకు ఉద్యోగం రాలే..

నేను వ్యవసాయం చేస్తూ నా కుమారుడిని ఎంబీఏ చదివించాను. ఉద్యోగం రాకపోవడంతో అతను కూడా నాతోపాటు వ్యవసాయం చేస్తున్నాడు. ఆరుగాలం కష్టపడి పనిచేసినా వ్యవసాయంలో లాభాలు రావడం లేదు. ఎరువుల ధరలు, కూలీ రేట్లు అధికమయ్యాయి. పెట్టుబడులు ఏటేటా పెరిగిపోతున్నాయి. పండించిన పంటలకు మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం’’ అని మల్కాపూర్‌ గ్రామానికి చెందిన రైతు రాములు.. రేవంత్‌ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. స్పందించిన రేవంత్‌.. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, రైతులకు, ప్రజలకు భరోసా ఇస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే నిరసన యాత్ర చేపడుతున్నామని చెప్పారు.  


చిలుకూరు బాలాజీ సన్నిధిలో..

పాదయాత్రకు బయలుదేరిన రేవంత్‌ రెడ్డి, దిగ్విజయ్‌సింగ్‌ తొలుత చిలుకూరు బాలాజీని దర్శించుకున్నారు. ముందుగా దిగ్విజయ్‌సింగ్‌ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ విశిష్టతను అర్చకులు రంగరాజన్‌ ఆయనకు వివరించారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఇరువురూ పాదయాత్రకు బయలుదేరారు.

Updated Date - 2021-12-19T07:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising