ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరణి పోర్టల్‌ ద్వారా మెరుగైన సేవలు

ABN, First Publish Date - 2021-10-30T04:21:49+05:30

ధరణి పోర్టల్‌ ద్వారా ప్రజలకు సులభతరంగా, నిష్పక్షపాతంగా సేవలు అందుతున్నాయని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు.

ధరణి పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల క్రైం, అక్టోబరు 29 : ధరణి పోర్టల్‌ ద్వారా ప్రజలకు సులభతరంగా, నిష్పక్షపాతంగా సేవలు అందుతున్నాయని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన విలే కరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ధరణి పోర్టల్‌ విజయవంతంగా అమలవు తోంద న్నారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చి ఏడా ది పూర్తి కావడం ఎంతో సంతోషకరమన్నారు. ధరణి ద్వారా ల్యాండ్‌ రిజిస్ర్టేషన్‌ సులభతరంగా మారిందని, ప్రతి మండలంలో వ్యవసాయ భూములకు సంబంధించి వన్‌స్టాప్‌ సొల్యూషన్‌ చేయగలుగుతున్నామన్నారు. గడిచిన ఏడాది కాలం లో 31,000 ధరఖాస్తులు రాగా, అందులో 30,000 వేల ధరఖాస్తులను డిస్పోజ్‌ చేసామని తెలిపారు. అందులో 10,656 సెల్స్‌ ట్రాన్సక్షన్లు, 4,638 గిఫ్ట్‌ డీడ్‌లు, 1,987 సక్షేశన్‌, మార్టిగేజ్‌లు 880 జరిగాయని వివరించారు. అలాగే 5,805 పెండింగ్‌ మ్యుటేషన్లు క్లియర్‌ చేశామని, 4,919 గ్రీవెన్స్‌, 407 ప్రొహిబిషన్‌ లిస్ట్‌ సమస్యలు, 211 కోర్టు కేసులు పరిష్కరించామన్నారు. ధరణిలో 31 రకాల మాడ్యుల్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిని వినియోగించుకొని భూములకు సంబంధించి సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. నిషేదిత భూముల విషయంలో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు గ్రామాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. అనంతరం ధరణి సేవలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రఘురామ్‌శర్మ, శ్రీహర్ష పాల్గొన్నారు.


ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశపు హాలులో పంచాయితీరాజ్‌, నీటి పారుదల శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. గద్వాల నియోజకవర్గంలో 1,300 ఇళ్లు మంజూరు కాగా, 585 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మిగతా 715 త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలంపూర్‌లో 1,170 ఇళ్లకు గాను, 580 ఇళ్లకు టెండర్లు పూర్తయ్యాయని, మిగితా ఇళ్ల నిర్మాణానికి స్ధలాన్ని గుర్తించాలని ఎమ్మార్వోలను ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మ, పంచాయితీ రాజ్‌ ఈఈ సమత, ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీనివాసరావు, ఏవో మదన్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T04:21:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising