ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయ కేటాయింపులపై గందరగోళం

ABN, First Publish Date - 2021-12-20T04:09:29+05:30

నూతన జిల్లాల వారీగా ఉపాధ్యాయుల కేటాయింపుల్లో స్పష్టత కరురైంది. సీనియారిటీ జాబితాల్లో లోపాలు, తప్పుల సవరణ తేలకపోవడంతో కేటాయింపుల ప్రక్రియ ముగియడం లేదు.

మహబూబ్‌నగర్‌లోని డైట్‌ కాలేజీ వద్ద అభ్యంతరాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద ఉపాధ్యాయులు(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసంతృప్తిలో టీచర్లు

హడావుడి జాబితాలతో అన్యాయం జరిగిందనే ఫిర్యాదులు

సమస్యలను పరిష్కరించకుండా కేటాయింపులొద్దనే డిమాండ్లు

అందుకు రెండు రోజులు గడువు పొడగించాలని సూచనలు


 నూతన జిల్లాల వారీగా ఉపాధ్యాయుల కేటాయింపుల్లో స్పష్టత కరురైంది. సీనియారిటీ జాబితాల్లో లోపాలు, తప్పుల సవరణ తేలకపోవడంతో కేటాయింపుల ప్రక్రియ ముగియడం లేదు. ఒకదాని వెనుక ఒక సమస్య తెరమీదకు వస్తుండడంతో కేటాయింపు జఠిలమవుతోంది. జాబితాల్లో పదేపదే తప్పులు దొర్లుతున్నా, సవరించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వ్యవహరించిందనే ఆరోపణలు వస్తున్నాయి. జీవో నంబర్‌ 317 విడుదలైనప్పటి నుంచి మొదలైన ఈ వర్గీకరణలో తొందరపాటుగా వ్యవహరించడం వల్లే పలువురు ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందనే ఆవేదన వ్యక్తమవుతోంది. 

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి


 వర్గీకరణ కోసం తయారు చేసిన సీనియారిటీ జాబితాలు ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. జీవో నంబర్‌ 317 ప్రకారం తయారు చేసిన ఈ జాబితా గందరగోళాన్ని సృష్టించింది. జీవో ప్రకారం మెరిట్‌, సీనియారిటీ ఆధారంగా జాబితా రూపొందించాల్సి ఉండగా, విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యంతో జాబితాలు తారుమారయ్యాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతు న్నాయి. 2012 డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యా యుల జాబితాపై బాధితులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ జాబితాలో మెరిట్‌ ప్రకారం మొదటి స్థానంలో ఉండాల్సిన ఉపాధ్యాయుని పేరు 14వ స్థానంలో ఉంచారని పేర్కొన్నారు. ఈ డీఎస్సీలో  అత్యల్ప మార్కులతో ఎంపికయిన ఉపాధ్యాయులను ఈ జాబితాలో ఇతని కంటే ముందు చేర్చారని వాపోతున్నారు. ఈ పొరపాటుపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా, దాన్ని పట్టించుకోకుండా అలాట్‌మెంట్‌ ఇచ్చారని అంటున్నారు. దీంతో సదరు అభ్యర్థికి అన్యాయం జరిగిందని, దీనిపై కలెక్టర్‌ నేతృత్వంలో విచారణ జరపాలని కోరుతున్నారు. హిందీ టీచర్ల కేటాయిం పుల్లోనూ ఈ పక్షపాతమే కొనసాగిందని, సీనియారిటీని, మెరిట్‌ను పట్టించుకోలేదని పలువురు టీచర్లు వాపోతున్నారు. పోస్టులు 18 ఉన్నా 14 పోస్టులకే కేటాయింపులిచ్చారని, మెరిట్‌, సీనియారిటీ ప్రకారం ఆప్షన్‌ ఇచ్చిన జిల్లాల్లో ప్రాధాన్యాలు పట్టించుకోకుండా సర్ధుబాటు చేశారని చెబుతున్నారు. దీంతో స్థానిక జిల్లాకు దూరంగా ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాలోనే మళ్లీ ఒకదఫా పని చేయాల్సి వచ్చిందని వాపోతున్నారు.


సొంత జిల్లాల్లో స్థానికేతరులు

సీనియారిటీ జాబితాలో తప్పులు సవరించకపోవడంతో పలువురు స్థానికులు సొంత జిల్లాల్లో స్థానికేతరులు అయిపోతున్నారని, తక్కువ సీనియారిటీ ఉన్న జూనియర్లను దూర, మారుమూల జిల్లాలకు పంపడం వల్ల వారు ఆ జిల్లాల్లోనే సుదీర్ఘకాలం పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. దీంతో అక్కడి పోస్టులు ఖాళీలు ఏర్పడక స్థానిక యువతకు ఉద్యోగా అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఈ కేటాయింపులతో ఏర్పడిందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఒక డీఎస్సీలో సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయులకంటే ఆ తర్వాత వచ్చిన డీఎస్సీల్లో ఎంపికైన ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాలో ముందుండడం ఎలా సాధ్యమని, వీటన్నింటిపై సమగ్రమైన పరిశీలన జరపాలనే సూచనలు వస్తున్నాయి. 1975 రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కనపెట్టి ఈ సర్ధుబాటు జరుగుతోందని, స్థానికతను పక్కన పెట్టడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలువురు ఉపాధ్యాయులకు కేటాయింపుల్లోనూ అన్యాయం జరిగిందని వాపోతున్నారు.


పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు

డీఎస్సీ -1996 అభ్యర్థులు, డీఎస్సీ 2012 అభ్యర్థులు, ప్రభుత్వ యాజమాన్యంలో నియమితులై, జడ్పీ యాజమాన్యంలో పనిచేసే ఉద్యోగులు, హిందీ, తెలుగు ఉపాధ్యాయుల జాబితాల రూపకల్పనలో పొరపాట్లు జరిగాయని ఉపాధ్యాయులు అంటున్నారు. వాటిపై పెద్ద సంఖ్యలోనే  ఫిర్యాదులు చేశారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించే పరిస్థితి కనిపించడం లేదని, హడావుడిగా ఉత్తర్వులు, కేటాయింపుల వల్లే సమస్యలు వస్తున్నా యని వాపోతున్నారు. ఉపాధ్యాయులకు తీర్చలేని నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు. ఉమ్మడి జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయుల విభజన ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిగా నియమితులైన ఆర్థికశాఖ కార్యదర్శి రొనాల్డ్‌రోస్‌, కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు చొరవ తీసుకొని ఈ సమస్యల పరిష్కారానికి మరో రెండు రోజుల గడువు పొడగించాలని అంటున్నారు. అందరికీ న్యాయం జరిగేలా కేటాయింపులు చేయాలనే సూచనలు ఉపాధ్యాయ వర్గాలు, సంఘాల నాయకుల నుంచి వస్తున్నాయి. 

Updated Date - 2021-12-20T04:09:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising