యువకుల జోరు.. జనం బేజారు
ABN, First Publish Date - 2021-12-31T05:46:31+05:30
జిల్లా కేంద్రంలో కొందరు యువకులు రాత్రి వేళల్లో జల్సాలు చేసు కుంటూ స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.
- రాత్రి వేళ రోడ్ల పక్కన జల్సాలు
- ఓ ప్రైవేట్ వెంచర్‌లో తరచూ వేడుకలు
- మద్యం మత్తులో బైక్ రైడింగులు
- ఇబ్బంది పడుతున్న స్థానికులు
గద్వాల క్రైం, డిసెంబరు 30 : జిల్లా కేంద్రంలో కొందరు యువకులు రాత్రి వేళల్లో జల్సాలు చేసు కుంటూ స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణారోడ్డు లోని అంజనేయస్వామి దేవాలయ సమీపంలో ఉన్న ఓ వెంచర్‌లో తరుచూ పుట్టినరోజు వేడుకులు చేసుకుంటున్నారు. అక్కడే కేక్ కట్ చేసుకొని వేడుకలు జరుపుకుంటున్నారు. మద్యం కూడా తాగుతున్నారు. కొందరు మద్యం మత్తులో బైక్ రైడింగ్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తు న్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి.
రాత్రి వేళల్లో పుట్టినరోజు వేడుకలు
గద్వాల పట్టణంలోని కృష్ణానది రోడ్‌లో ఉన్న అంజనేయ స్వామి దేవాలయం సమీపంలో గల ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లోని ఖాళీ స్థలంలో యువకులు తరుచూ పుట్టినరోజు వేడుకలు జరుపుకుం టున్నారు. అక్కడే మద్యం తాగి ఖాళీ సీసాలను రో డ్లపై విసిరేస్తున్నారు. దీంతో ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేవారు, దేవాలయానికి వచ్చి పోయే వారు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. దీనికి తోడు కొందరు యువకులు మద్యం తాగి బైక్‌రైడింగ్ చేస్తున్నారు. కృష్ణానది రోడ్‌లో ఉన్న అంజనేయ స్వామి దేవాలయం నుంచి కృష్ణవేణి చౌరస్తా, కృష్ణానది వరకు బైక్‌లను వేగంగా నడుపుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నా రు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, పట్టణంలో రాత్రి వేళ ల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తీవ్ర ఇబ్బంది పడుతున్నాం
విష్ణు, గద్వాల : యువకులు మద్యం తాగి రోడ్లపై బైక్‌లను అతివేగంగా నడుపుతుండటంతో తీవ్ర ఇబ్బం ది పడ్తున్నాం. దేవాలయానికు వచ్చే మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం
షేక్ మహబూబ్ బాష, సీఐ : ఈ విషయంపై మాకు సమాచారం లేదు. ఆ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఉంచుతాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా చర్యలు తీసుకుంటాం. బైక్ రైడింగ్‌లు, రోడ్లపై మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు చేపడతాం.
Updated Date - 2021-12-31T05:46:31+05:30 IST