ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ

ABN, First Publish Date - 2021-12-26T05:11:58+05:30

జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలోగల అయ్యప్పకొండ పై శనివారం అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

అయ్యప్పస్వామి ఆభరణాలు ఊరేగిస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌ టౌన్‌, డిసెంబరు 25 : జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలోగల అయ్యప్పకొండ పై శనివారం అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప కొండ అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది.  అదేవిధంగా ఉదయం రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో అయ్యప్పకొండపై ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. అనంతరం తూర్పు కమాన్‌ నుంచి ప్రారం భించిన అయ్యప్ప కలశం ఊరేగింపు, గడియారం చౌరసా మీదుగా అశోక్‌ థియేటర్‌, అంబేడ్కర్‌ చౌరస్తా, న్యూటౌన్‌, మెట్టుగడ్డ నుంచి పద్మావతి కాలనీకి చేరుకున్నది. గడి యారం చౌరస్తా వద్ద   స్వామి ఆభరణాకు, కలశానికి మంత్రి శ్రీనివాస్‌గౌడు ప్రత్యేక పూజలు చేశారు.  కలశం ఊరేగింపులో కోలాటాలు, భజనలతో, భక్తిగీతాలతో నృత్యం చేశారు.  కలశం ఊరేగింపు అయ్యప్పకొండ చేరుకున్న తర్వాత స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.  అయ్యప్పకొండపై మహా పడిపూజ ఉండడంతో ఉదయం నుంచి వాహనాల రద్దీ అధికంగా ఉన్నది.  కొండపైకి ముఖ్య నా యకులు అధిక సంఖ్యలో వస్తున్నం దుకు పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. 






Updated Date - 2021-12-26T05:11:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising