గెస్ట్ లెక్చరర్ల గోస
ABN, First Publish Date - 2021-09-14T04:20:07+05:30
గెస్ట్ లెక్చరర్ల జీవితాలను కరోనా ఛిద్రం చేసింది.. అరకొర జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న వారిపై పంజా విసరడంతో ఉపాధి కరువై, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి..
- కరోనా వ్యాప్తితో ఏడాదిన్నరగా ఉపాధి కరువు
- ఆర్థికంగా చితికిపోయిన గెస్ట్ లెక్చరర్ల కుటుంబాలు
- కరోనాకు ముందు పెండింగ్‌లో మూడు నెలల జీతాలు
- కళాశాలలు పునఃప్రారంభమైనా రెన్యువల్ చేయని యాజమాన్యాలు
- నియామకాలకు ఉత్తర్వులు జారీ చేయని రాష్ట్ర సర్కారు
- మనో వేదనలో అతిథి అధ్యాపకులు
నాగర్‌కర్నూల్ (ఆంధ్రజ్యోతి)/మహబూబ్‌నగర్, విద్యా విభాగం : గెస్ట్ లెక్చరర్ల జీవితాలను కరోనా ఛిద్రం చేసింది.. అరకొర జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న వారిపై పంజా విసరడంతో ఉపాధి కరువై, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.. కష్టకాలంలో ఆదుకునే వారు లేక.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదరించక వీరి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేసిన ఉపాధ్యాయులకు నెలకు రూ.2 వేల సాయంతో పాటు 25 కిలోల బియ్యం ఇచ్చి ఆదుకున్న రాష్ట్ర సర్కారు, గెస్ట్ లెక్చరర్లను విస్మరించింది.. ఈ నేపథ్యంలో ఏడాదిన్నరగా వేతనాలందకపోవడం, తాజాగా విద్యా సంస్థలు మొదలైనా మళ్లీ ఉద్యోగాన్ని రెన్యువల్ చేయకపోవడంతో కుటుంబ పోషణ భారంమై, ఇటీవల వెల్దండ మండలం బొల్లంపల్లికి చెందిన గెస్ట్ లెక్చరర్ కాసోజు గణేష్ ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన రేకెత్తించింది.. దీంతో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలనే డిమాండ్ బలపడుతోంది..
ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీలున్న చోట్ల తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ లెక్చరర్లను ప్రభుత్వం నియమిస్తోంది. వీరికి రోజూ కనీసం మూడు తరగతులు ఉండేలా చూస్తూ, ఒక్కో తరగతికి బోధించినందుకు రూ.300 చొప్పున రోజుకు రూ.900 చొప్పున నెలలో పని దినాలకు మాత్రమే వేత నాలిస్తోంది. ఈ లెక్కన ఒక్కో అధ్యాపకుడు సగటున నెలకు రూ.22 వేల వేతనం మాత్రమే పొందేవారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ప్రాతిపదికన 54 కాలే జీల్లో 241 మంది గెస్ట్ లెక్చరర్లు కరోనాకు ముందు పని చేశారు. కరోనా వ్యాప్తితో కాలేజీలు మూతపడటంతో దాదాపు ఏడాదిన్నరగా వీరంతా ఏ ఉపాధి లేక ఖాళీ గా ఉంటున్నారు. దీనికితోడు కరోనా వచ్చే సమయానికి వీరికి ఒక్కొక్కరికీ మూ డు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్ వేతనాలు రాక పోవడం, కరోనా కాలంలో వేతనాల్లేకపోవడంతో వీరంతా ఈ ఏడాదిన్నరగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు అప్పులు చేయడ మో లేక వేరే వృత్తులలోకి మారడం జరిగింది. కొందరు మానసిక వేదన తట్టుకో లేక ఆందోళన చెందారు. కరోనా సమయంలో ప్రభుత్వం సైతం వీరిని ఆదుకునేం దుకు ఎలాంటి సహాయ మూ చేయలేదు. ప్రైవేట్ టీచర్ల మాదిరిగా నెలకు రూ.2 వేల పారితోషికం, 25 కేజీల ఉచిత బియ్యం కూడా వీరికి అందలేదు. ఇన్ని ప్ర తిబంఽధకాల నడుమ గెస్ట్ లెక్చరర్లు అవస్థలు పడ్డారు. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కాలేజీలన్నీ పునఃప్రారంభమైనా, గెస్ట్ లెక్చరర్లను ఇంకా రెన్యువల్ చేయలే దు. కారణమేంటని అడిగితే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదనే సమాధానం స్థా నికంగా కాలేజీల ప్రిన్సిపాళ్ల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని పెండింగ్ వేతనాలిప్పించాలని, గెస్ట్ లెక్చరర్లను పునఃనియమించుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని గెస్ట్ లెక్చరర్ల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
పూట గడవని స్థితిలో కుటుంబాలు
ప్రభుత్వ కళాశాలల్లో అతిథి అధ్యాపకు లుగా పని చేస్తున్న వారి కుటుంబాల్లో ఆకలి కేక లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో శాశ్వత నియామకాలకు తిలోదకాలు ఇచ్చి, 2012 నుంచి గెస్ట్ లెక్చరర్ల నియామకానికి సం బంధించిన అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. 2012లో ప్రభుత్వ జూని యర్ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు పక్క జూనియర్ కళాశాలకు చెందిన మరో ప్రిన్సిపాల్ అతనితో పాటు ప్రధాన సబ్జెక్టులో నిష్ణాతులైన లెక్చరర్లు కలిపి త్రిమెన్ కమిటీగా రూపొందించారు. అతిథి అధ్యాపకుల బోధన సామర్థ్యం, చేతిరాతను ప్రామాణికంగా తీసుకొని వారిని గెస్ట్ లెక్చరర్‌గా నియమించారు. ఈ క్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో కొ ల్లాపూర్, కోడేరు, అచ్చంపేట, అమ్రాబాద్, కొండనాగుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కేవలం అతిథి అధ్యాపకుల మీద ఆధారపడి నడుస్తున్నాయి. కల్వకుర్తి జూనియర్ కళాశాలలో ఫిజిక్స్, బటానీకి తప్ప ఆర్ట్స్ విభాగంలో బోధకుల నియామకాలు చేపట్టలేదు. దీం తో విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చేరుతున్నారు. అయితే, తమ ఉద్యోగ పరిరక్షణ కోసం ఇల్లిల్లు తిరిగి విద్యార్థులను ప్రభుత్వ క ళాశాలల వైపు ఆకర్షితులను చేసిన అతిథి అధ్యాపకులు, మనో వేదనకు గురవుతున్నారు. నెలకు జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా రూ.21,600 వేతనానికి అంకిత భావంతో బో ధనలు చేసినా, వేతనాలను సకాలంలో విడుదల చేయక పోవడంతో కుటుంబ పోషణ, పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు చెల్లించలేక పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
Updated Date - 2021-09-14T04:20:07+05:30 IST