ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ABN, First Publish Date - 2021-12-25T05:30:00+05:30

యేసుక్రీస్తు జననం అంటేనే సహనానికి, ఓర్పుకు ప్రతీక అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

వనపర్తి కల్వరీ టౌన్‌ చర్చిలో పాస్టర్‌కు కేక్‌ తినిపిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  అన్ని చర్చిలలో ప్రార్థనలు చేసిన క్రైస్తవులు   

- శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నిరంజన్‌రెడ్డి


వనపర్తి టౌన్‌, డిసెంబరు 25: యేసుక్రీస్తు జననం అంటేనే సహనానికి, ఓర్పుకు ప్రతీక అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవ సోదరులు జిల్లా కేంద్రం లోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మిషన్‌ కంపౌండ్‌లోని ఎంబీ ఒలీవచర్చి, గాంధీనగర్‌లోని కల్వారి టౌన్‌ చర్చిల్లో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హాజరై, మాట్లాడారు. ఈర్షాద్వేషాలు, కోపతాపాలకు అతీతంగా ప్రేమించే తత్వాన్ని అలవాటు చేసుకోవడమే క్రైస్తవ తత్వమని మంత్రి పేర్కొన్నారు. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు ప్రతీ ఒక్కరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. అదే విధంగా, గోపాల్‌పేటలో ఎంపీపీ సంధ్య, జడ్పీటీసీ మంద భార్గవి స్థానిక చర్చిలో కేకు కట్‌ చేసి క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్తకోటలోని చర్చిలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌తో పాటు, పలువురు ప్రజా ప్రతి నిధులు, పార్టీల నాయకులు వేడుకలకు హాజరయ్యారు. ఆత్మకూర్‌ మం డలం ఖానాపూర్‌లో నిరుపేద క్రైస్తవులకు వీజేఆర్‌ ఫౌండేషన్‌ అధినేత వర్క టం జగన్నాథ్‌రెడ్డి దుస్తులు పంపిణీ చేశారు. పాన్‌గల్‌, మదనాపురం, పెబ్బే రు, అమరచింత, పెద్దమందడి, వీపనగండ్ల మండలాల్లోని పలు గ్రామాల్లో క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  



Updated Date - 2021-12-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising