ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా ఆసుపత్రిలో ఐసీయూ కేంద్రం ప్రారంభం

ABN, First Publish Date - 2021-06-23T04:57:03+05:30

యునెటె డ్‌-వే హైదరాబాద్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లా ఆసుపత్రికి పది పడకల అత్యవసర వైద్య కేంద్రం సమకూర్చడం అభినందనీయమని జడ్పీ చైర్‌పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి అన్నారు.

ఐసీయూ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ రాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): యునెటె డ్‌-వే హైదరాబాద్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లా ఆసుపత్రికి పది పడకల అత్యవసర వైద్య కేంద్రం సమకూర్చడం అభినందనీయమని జడ్పీ చైర్‌పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పది పడకల ఐసీయూ సౌకర్యం ఉన్నకేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌తో కలిసి ఎంపీ రాములు మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈసందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ యునైటెడ్‌-వే హైదరాబాద్‌ స్వచ్ఛంద సంస్థ వారు సిలికాన్‌ ల్యాబ్స్‌ నుంచి విరాళంగా దాదా పు రూ.35లక్షల విలువ గల 10 పరికరాలు, 5మాని టర్లు, రెండు వెంటిలేటర్లు, 5ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, రెండు స్ట్రచర్లు, ఇతర సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ మాన వాళి మనుగడకు ముప్పుగా కరోనా ఏర్పడిన ఈ త రుణంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛం ద సంస్థల కృషి అభినందనీయమన్నారు.   అనంత రం కలెక్టర్‌ శర్మన్‌ మాట్లాడుతూ కరోనా థర్డ్‌వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఐసీయూ పడకలు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. వీటితో కలిపి ప్రభుత్వ ఆసుపత్రిలో 30ఐసీయూ పడకలు అందుబాటులోకి వచ్చాయన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఏ సహాయం చేయాలనుకున్నా నాగర్‌కర్నూల్‌ జిల్లా కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ సమాజ సేవలో మే ము సైతం అని ముందుకొచ్చిన యునైటెడ్‌-వే హైద రాబాద్‌ వారిని అభినందించారు. కార్యక్రమంలో ము నిసిపల్‌ చైర్‌పర్సన్‌ కల్పన, జిల్లా వైద్యాధికారి సుధాక ర్‌లాల్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శివరాం, హెడ్‌ క్వార్టర్‌ సూపరింటెండెంట్‌ డా. రమేష్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా కన్వీనర్‌ రమేష్‌రెడ్డి, యునైటెడ్‌-వే సీనియర్‌ మేనేజర్‌ నాగభూషణ్‌రెడ్డి, శేఖర్‌, ఎంపీపీ నర్సింహరెడ్డి, వైద్యా ధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-23T04:57:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising