ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టేషన్‌ రైటర్ల పాత్ర కీలకం

ABN, First Publish Date - 2021-12-31T05:56:28+05:30

కేసుల విచారణ నివేదికలను పటిష్టంగా రూపొందించడం, వివరాలను ఎప్పటికప్పుడు అన్‌లైన్‌లో పొందుపర్చడంలో రైటర్ల పాత్ర కీలకమని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు.

సమావేశం లో మాట్లాడుతున్న ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

గద్వాల క్రైం, డిసెంబరు 30 : కేసుల విచారణ నివేదికలను పటిష్టంగా రూపొందించడం, వివరాలను ఎప్పటికప్పుడు  అన్‌లైన్‌లో పొందుపర్చడంలో రైటర్ల పాత్ర కీలకమని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గురువారం అన్ని పోలీస్‌స్టేషన్లు, సర్కిల్‌, సబ్‌ డివిజన్‌ రైటర్లకు డీఎస్పీ రంగస్వామి ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ మాట్లాడుతూ ఎఫ్‌ఐ ఆర్‌ నమోదు, డేటా ఎంట్రీ, బ్రీఫ్‌ తయారీలో తీసుకోవలసిన అంశాలపై రైటర్లకు పలు సూచనలు చేసారు. కేసుల నివేదికల తయారీ, సీసీటీఎన్‌ఎస్‌ ఆప్‌డేట్‌లో రైటర్లు నిర్వహిం చాల్సిన పాత్రపై వివరించారు. ఏదైనా గ్రేవ్‌ కేసు ఫిర్యాదు వచ్చినప్పుడు వెంటనే ఎఫ్‌ఐఆర్‌ జారీ చేయడం, కోర్టుకు పంపిం చడం, ఉన్నతాధికారులకు తెలపడం, సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌కు రక్షణ కల్పించడం, వెంటనే రేడియో మేసేజ్‌ ద్వారా క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌లకు సమాచారం అందించడం, సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ను ఫొటోగ్రఫీ చేయడం, సాక్ష్యాలను సేకరించడం తదితర అంశాలను వివరించారు. ఇన్వెస్టిగేషన్‌ ఆధారంగా కంక్లూజన్‌ పార్ట్‌లో పొందుపర్చడంలో తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు. నిందితుల పూర్తి వివరాలను సమగ్రంగా పొందుపర చాలని, ఆ డాటా బేస్‌ ఆధారంగా ఎన్నో కేసులు ఛేదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ రంగస్వామి, సీఐ షేక్‌ మహబూబ్‌ బాషా పాల్గొన్నారు. 


ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటించాలి

కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ను నియంత్రించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను ప్రతీ ఒక్కరు పాటించాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 రాత్రి నూతన సంవత్సర వేడుకలను బహిరంగ ప్రదేశాలలో జరుపుకోవడం నిషేధం అన్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5.00 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్లైఓవర్‌ మూసి వేయనున్నామని పేర్కొన్నారు. జిల్లాకేంద్రంతో పాటు ఇతర పట్టణాలలో ప్రత్యేక పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. 


Updated Date - 2021-12-31T05:56:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising