ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశయాల సాధనే నిజమైన నివాళి

ABN, First Publish Date - 2021-12-04T04:21:00+05:30

ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరురలైన త్యాగ మూర్తులకు వారి ఆశయాల సాధనతోనే నిజమైన నివాళులర్పించగలమని నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ అన్నారు.

శ్రీకాంతాచారి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న రంజిత్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ 

గద్వాల టౌన్‌/అయిజ డిసెంబరు 3 : ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరురలైన త్యాగ మూర్తులకు వారి ఆశయాల సాధనతోనే నిజమైన నివాళులర్పించగలమని నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతా చారి వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని యూనియన్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో విష్ణు, సామేలు, కృష్ణన్న, వెంకటేష్‌, నరేష్‌, రాఘవేంద్ర పాల్గొన్నారు. 


- విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్యసంఘాల ఆధ్వర్వంలో శుక్రవారం గద్వాల పట్టణంలోని పాత బస్టాండు సర్కిల్‌లో దివంగత శ్రీకాంతాచారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కరాటే సత్యం మాట్లాడుతూ పట్టణంలో ఆచార్య జయశంకర్‌, శ్రీకాంతాచారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవినిచ్చి గౌరవించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకరాచారి, జిల్లా కార్యదర్శి నరసింహాచారి, నాగరాజుచారి, గాంధీ, రాఘవేంద్రాచారి, కేశవాచారి, వెంకటేష్‌ ఆచారి, నరసింహాచారి, ప్రవీణ్‌, కమ్మరిరాము, వేదవ్యాస్‌చారి, పంచముఖి, ప్రవీణ్‌, రమణాచారి, శంకర్‌ ఉన్నారు.


- విశ్వబ్రాహ్మణుల సంఘం, విశ్వకర్మ బంధు మిత్రులు, ఉద్యమనాయకుల ఆధ్వర్యంలో అయిజ  కొత్త బస్టాండ్‌ ముందు అమరుడు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సర్వేశ్వరాచారి, కాళిదాసు, రవిప్రకాష్‌, భీమేష్‌, రవి, వీరయ్య, కృష్ణ, గోపాల, శేఖర్‌, లక్ష్మయ్య, రాము, వీరేష్‌, బ్రహ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T04:21:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising