ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజేతలకు ఆకర్షణీయమైన నగదు పురస్కారాలు

ABN, First Publish Date - 2021-12-29T05:27:24+05:30

యువతలో శాస్త్రీయ తపన, స్ఫూర్తిని పెంపొందించే నిబద్ధతతో, గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హెదరాబాద్‌లోని స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ కలిసి సంయుక్తంగా శాస్త్ర సాంకేతికతలపై అఖిల భారత వ్యాసరచన పోటీని నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జీఏ రామారావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పటాన్‌చెరు రూరల్‌, డిసెంబరు 28 : యువతలో శాస్త్రీయ తపన, స్ఫూర్తిని పెంపొందించే నిబద్ధతతో, గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హెదరాబాద్‌లోని స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌,  టెక్నాలజీ కలిసి సంయుక్తంగా శాస్త్ర సాంకేతికతలపై అఖిల భారత వ్యాసరచన పోటీని నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జీఏ రామారావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మనదేశంలో ఇంటర్మీడియట్‌ లేదా ప్లస్‌ టూతో పాటు డిగ్రీ తొలి ఏడాది చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. శాస్త్రీయ అధ్యయనంపై విద్యార్థులకు అవగాహనను పెంపొందించడంతో పాటు ఆయా విభాగాల్లో వారు పరిశోధనలు చేపట్టేలా ప్రోత్సహించే లక్ష్యంతో  జాతీయాభివృద్ధిలో సైన్స్‌ పాత్ర (ప్రాచీన శాస్త్రీయ జ్ఞానం, భారతదేశం నుంచి సహకారం, నాణ్యమైన జీవనంలో సైన్స్‌ పాత్ర), మెరుగైన భవిష్యత్తు కోసం మన పర్యావరణం సురక్షితంగా ఉందా, జనాభా పేదరికం విద్యుత్‌కు పెరుగుతున్న డిమాండ్‌, నేటి యువతలో కుటుంబ విలువలు, ప్రభావం (భారతీయ సంస్కృతి, తల్లిదండ్రుల పాత్ర, స్వీయ క్రమశిక్షణ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం) వంటి అంశాల్లో ఏదో ఒక దానిపై వ్యాసరచన చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. చేతిరాత ప్రతులను స్కాన్‌ చేసి పంపాలని, టెస్ట్‌ చేసిన వ్యాసాలను అంగీకరించబోమని ప్రొఫెసర్‌ రామారావు స్పష్టీకరించారు. వచ్చిన వాటి నుంచి అత్యుత్తమమైన 30 వ్యాసాలను మాత్రమే ఎంపిక చేస్తామని, వాటిని రాసిన వారు 2022 ఫిబ్రవరి రెండోవారంలో ఆన్‌లైన్‌  ద్వారా వాటిని వివరించాల్సి ఉంటుందని తెలిపారు. మొదటిస్థానంలో నిలిచిన వారికి రూ.20 వేలు, రెండో బహుమతికి రూ.15 వేలు, మూడో బహుమతికి రూ.10 వేలు, మిగిలిన 27 మందికి ఒక్కొక్కరికీ రూ.2 వేల చొప్పున నగదు పురస్కారాలను జాతీయ సైన్స్‌ దినోత్సవం రోజు అందజేస్తామని ప్రొఫెసర్‌ రామారావు వివరించారు. వ్యాసాలను 2022 ఫిబ్రవరి 4వ తేదీలోగా పంపాలని, ఆన్‌లైన్‌ ప్రజెంటేషన్‌ 2022 ఫిబ్రవరి 14న ఉంటుందని, బహుమతి ప్రదానం 2022 ఫిబ్రవరి 28న చేస్తామన్నారు. ఇతర వివరాల కోసం 9000638872ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Updated Date - 2021-12-29T05:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising