బంగారు కోరమీసం, చంద్రవంక బహూకరణ
ABN, First Publish Date - 2021-12-31T17:19:20+05:30
మురవెల్లి మల్లికార్జునస్వామికి కరీంనగర్‌కు చెందిన భక్తులు పెద్ది విద్యాసాగర్, పెద్ది సందీప్ గురువారం రూ.1.80వేల విలువగల బంగారు కోరమీసం, చంద్రవంక, వెండి తీర్థఉద్ధరిణలను మొక్కుబడులుగా బహూకరించారు.
చేర్యాల, డిసెంబరు 30: కొమురవెల్లి మల్లికార్జునస్వామికి కరీంనగర్‌కు చెందిన భక్తులు పెద్ది విద్యాసాగర్, పెద్ది సందీప్ గురువారం రూ.1.80వేల విలువగల బంగారు కోరమీసం, చంద్రవంక, వెండి తీర్థఉద్ధరిణలను మొక్కుబడులుగా బహూకరించారు. వాటిని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి సమక్షంలో ఆలయాధికారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్, అర్చకసంఘం అధ్యక్షుడు పడిగన్నగారి ఆంజనేయులు, అర్చకులు మహదేవుని సాంబయ్య, పడిగన్నగారి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయాన్ని గురువారం కరీరనగర్ జడ్పీ చైర్‌పర్సన్ విజయగణపతి కుటుంబసమేతంగా సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Updated Date - 2021-12-31T17:19:20+05:30 IST