ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెలుగులు పంచే దీపావళి

ABN, First Publish Date - 2021-11-03T04:42:08+05:30

హిందువుల పండుగల్లో దీపావళి ప్రత్యేకమైనది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెడుపై మంచి విజయం సాధించిన రోజు

కొండపాక, నవంబరు 2 : హిందువుల పండుగల్లో దీపావళి ప్రత్యేకమైనది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం. దీపావళి అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్లిపోతాం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదురోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు, కార్తీక శుద్ధ విధియ ‘భగినీ హస్త భోజనం’తో ముగుస్తాయి. ధన త్రయోదశి ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. 

నరక చతుర్దశి..

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటారు. ఈరోజు ప్రాత:కాల స్నానం చాలా పుణ్యప్రదమని విశ్వాసం. కొన్ని ప్రాంతాల్లో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి తండ్రి, అన్నదమ్ములకు బొట్టు పెట్టి హారతి ఇస్తారు. ఈ సమయంలో ఆడపడుచులకు ఆశీస్సులు, కానుకలు అందజేస్తారు. సాధారణంగా ఈ పండుగకి కుటుంబసభ్యులంతా కలుస్తారు. కొత్త దుస్తులు ధరించి, నరకాసురుని వధ జరిగినందుకు ఆనందంగా టపాసులు కాలుస్తారు. మిఠాయిలను పంచుకుంటారు. 

భక్తిశ్రద్ధలతో లక్ష్మీపూజలు

చతుర్దశి మరుసటిరోజు వచ్చే అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటారు. రాత్రివేళలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు ఇంటి ముందు వెలిగిస్తారు. వ్యాపారసంస్థల్లో ధనలక్ష్మి పూజలు చేస్తారు. 

భగినీ హస్త భోజనం

సోదర సోదరీమణుల అనురాగానికి రక్షాబంధనం ప్రతీక అయితే, భగినీ హస్తభోజనం అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్ల ఆప్యాయతకు అద్దపంటే సంప్రదాయం. భగినీ అంటే సోదరీ, ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్తభోజనం అని అంటారు. కార్తీకశుద్ధ విదియ దీపావళి పర్వదినం అనంతరం రెండోరోజు నిర్వహిస్తారు. భగినీ హస్త భోజనం సోదరుల అపమృత్యువును నివారిస్తుంది. సంపూర్ణ ఆయుష్షును అందిస్తుందనే భావన.


Updated Date - 2021-11-03T04:42:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising