గంజాయి సాగుచేస్తున్న వ్యక్తి అరెస్టు
ABN, First Publish Date - 2021-11-03T04:39:24+05:30
మండలంలోని రఘోత్తంపల్లి గ్రామంలో గంజాయి మొక్కలను సాగుచేస్తున్న వ్యక్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.
దుబ్బాక, నవంబరు 2: మండలంలోని రఘోత్తంపల్లి గ్రామంలో గంజాయి మొక్కలను సాగుచేస్తున్న వ్యక్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ముస్తాబాద్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండలానికి దుబ్బాక మండలం రఘోత్తంపలి ్లగ్రామానికి చెందిన గౌరీ బాల్‌రాజు అనే వ్యక్తి ద్వారా గంజాయి సరఫరా అవుతున్నట్లు నమ్మదగిన సమాచారం అందిందన్నారు. ఈ మేరకు మంగళవారం తనిఖీ చేయగా బాల్‌రాజ్ ఇంటి సమీపంలో 6 గంజాయి మొక్కలు, రెండు ఎండిన మొక్కలతోపాటు పావుకిలో ఎండుగంజాయి పట్టుబడినట్లు తెలిపారు. దీంతో బాల్‌రాజును అదుపులోకి తీసుకొని, స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు.
Updated Date - 2021-11-03T04:39:24+05:30 IST