పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై నిర్లక్ష్యం వద్దు: మంత్రి హరీష్‌రావు
ABN, First Publish Date - 2021-06-30T18:56:46+05:30
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని... అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించరాదమని మంత్రి హరీష్‌రావు అన్నారు.
సిద్దిపేట: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని... అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించరాదమని మంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం గజ్వెల్ పట్టణంలోని స్థానిక మహతి ఆడిటోరియంలో నిర్వహించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి జిల్లా స్థాయి కార్యక్రమంపై సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతిలో గ్రామ సర్పంచ్‌ల అకౌంట్‌లోకి నేరుగా, పట్టణ ప్రగతిలో మున్సిపల్ అకౌంట్‌లోకి నేరుగా డబ్బులు పడుతున్నాయని తెలిపారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 12769 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్‌లు, డంప్ యార్డులు, వైకుంఠ దామాలను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి చెప్పారు.
పాడుబడ్డ బావులు, బొందలు, బోర్లు ఉంటే వెంటనే పూడ్చివేయాలని ఆదేశించారు. గ్రామాలలో ఎక్కడ కూడా విరిగిపోయిన కరెంట్ స్తంభాలు, తుప్పు పట్టినవి వెంటనే తొలగించాలని తెలిపారు. గ్రామాలలో ట్రాన్స్ ఫార్మర్‌లు కాళీ పోకుండా కావాలంటే అదనపు ట్రాన్స్ ఫార్మర్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలానికి ఒక్కటి చొప్పున బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పది రోజుల్లో ఏర్పాటు చేయాలన్నారు. పల్లె ప్రగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మిక తనిఖీ చేసి అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 28 కోట్ల 32 లక్షల రూపాయలను గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులను పూర్తిగా మంజూరి చేయడం జరిగిందన్నారు. పంచాయతీ సెక్రెటరీలకు స్కెల్ ఇవ్వడానికి జీవో పాస్ అయిందని... త్వరలోనే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ యసంగిలో 4లక్షల 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ క్రొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి , జిల్లాకు చెందిన ఎమ్యెల్యేలు, చైర్మన్‌లు అన్ని శాఖల అధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-30T18:56:46+05:30 IST