ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా

ABN, First Publish Date - 2021-10-14T05:50:42+05:30

ప్రకృతిని దేవతామూర్తిగా భావించి తొమ్మిది రోజులు ఆరాధించడం బతుకమ్మ పండుగ ప్రత్యేక త.

అల్లాదుర్గం మండలం కాయిదంపల్లిలోని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకృతిని దేవతామూర్తిగా భావించి తొమ్మిది రోజులు ఆరాధించడం బతుకమ్మ పండుగ ప్రత్యేక త. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన సంబురాలు బుధవారం సద్దుల బతుకమ్మతో ముగిశాయి. మెదక్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌, రామాయంపేట, సంగారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోలు, తదితర పట్టణాలు పూలవనంగా మారాయి. తీరొక్క పూలతో అందంగా ముస్తాబు చేసిన బతుకమ్మలతో పట్టణ వీధులకు కొత్త శోభ చేకూరింది. గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఆడపడుచులు సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.  గతేడాది కరోనా కారణంగా తక్కువ మందితో ఇళ్ల ముందే బతుకమ్మ ఆడిన ఆడపడుచులు  ఈ సారి తొమ్మిది రోజుల పాటు సంబరంగా ఆడిపాడారు.  ప్రతి వీధి ఆడపడుచుల ఆప్యాయ పలకరింపులు, ఆటపాటలతో సందడిగా కనిపించింది. 


తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

 మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌ 

మెదక్‌రూరల్‌, అక్టోబరు13: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ఆత్మగౌరవానికి ప్రతీకైన బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాశస్త్యముందని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ అన్నా రు. బుధవారం కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. పూలను పూజిం చే, మహిళలను గౌరవిస్తూ వారి ఔనత్యాన్ని చాటి చెప్పే గొప్పపండుగ బతుకమ్మ అని అన్నారు. అనంతరం కొమ్ముల శేఖర్‌గౌడ్‌ బృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రమేష్‌, డీఆర్‌డీవో శ్రీనివాస్‌, డీపీవో తరుణ్‌ కుమార్‌, డీఈవో రమేష్‌, సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, బీసీ అభివృద్ధి అధికారి జగదీష్‌, జయరాం నాయక్‌, జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు, ఏవో యూసుఫ్‌, నారాయణరెడ్డి, అంగన్‌వాడీ టీచర్లు, స్వయంసహాయ సంఘాలు, మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు. 







Updated Date - 2021-10-14T05:50:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising