ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాభివృద్ధికి నిధులు కేటాయించింది టీఆర్‌ఎస్సే

ABN, First Publish Date - 2021-12-30T05:45:49+05:30

విద్యాభివృద్ధికి అధిక నిధులు కేటాయించింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూపాల్‌రెడ్డి ఉమ్మడి జిల్లా రాజకీయ భీష్ముడు

మంత్రి హరీశ్‌రావు


రామచంద్రాపురం, డిసెంబరు29: విద్యాభివృద్ధికి అధిక నిధులు కేటాయించింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటర్‌ వరకు ఉచిత విద్యను అందిస్తుంది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు. రామచంద్రాపురం పట్టణంలో ప్రొటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి తన సొంత నిధులతో నిర్మించిన వి.గీతాభూపాల్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను బుధవారం రాత్రి మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటర్‌ విద్యకు రూ.300 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. వి.భూపాల్‌రెడ్డి తన సొంత నిధులు రూ.2.5 కోట్లతో ప్రభుత్వ కళాశాలను నిర్మించడం అభినందనీయమన్నారు. కాగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో భూపాల్‌రెడ్డి రాజకీయ భీష్ముడని హరీశ్‌రావు అన్నారు. ఆయన కోరిన విధంగా అనాథ పాఠశాల, బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డిగ్రీ కళాళాల ఏర్పాటు విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌, ఫారుఖ్‌హుస్సేన్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పాతూరి సుధాకర్‌రెడ్డి, ప్రభాకర్‌, వెంకటేశ్వర్లు, దామోదర్‌రెడ్డి, జైపాల్‌, రాంరెడ్డి, కార్పొరేటర్లు పుష్ప, సింధూఆదర్శరెడ్డి, కుమార్‌, తుమ్మల పాండురంగారెడ్డి, అహ్మద్‌ పటేల్‌,  ఆదర్శరెడ్డి, పరమేశ్‌యాదవ్‌, ప్రిన్సిపాల్‌ ఉమామహేశ్వర్‌, పలువురు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-30T05:45:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising