ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్ హైదరాబాద్ లో తయారు కావడం గర్వకారణం:తలసాని

ABN, First Publish Date - 2021-01-06T22:01:26+05:30

ప్రపంచ దేశాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్ ను హైదరాబాద్ లోనే తయారు చేయడం మనందరికీ ఎంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రపంచ దేశాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్ ను హైదరాబాద్ లోనే తయారు చేయడం మనందరికీ ఎంతో  గర్వకారణం అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సైకిల్ బ్రాండ్ అగర్ బత్తి ఆధ్వర్యంలో కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కార్యక్రమం క్రింద 5 వేల శాని టైజర్ బాటిల్స్ ను హైదరాబాద్ జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ కు మంత్రి అందజేశారు.


సామాజిక బాధ్యతగా శాని టైజర్ బాటిల్స్ ను అందించడం పట్ల కార్యక్రమంలో పాల్గొన్న సైకిల్ బ్రాండ్ అగర్ బత్తి తెలంగాణా ఏరియా మేనేజర్ కొండా శ్రీనివాస్ ఇతర ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వివరించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఎప్పటి కప్పుడు అధికారులతో సమీక్షలు జరుపుతూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రజలు కూడా తప్పని సరిగా మాస్క్ ను ధరించి, సామాజిక దూరం పాటించాలని కోరారు. 

Updated Date - 2021-01-06T22:01:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising